/rtv/media/media_files/2025/04/15/CEFZ09TOIV3aAYXGX8bl.jpg)
Cracked heels
వేసవి కాలంలో చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరం. ముఖ్యంగా ముఖం, చేతుల్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నంలో పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మడమల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. ఇది శీతాకాలంలో మాత్రమే కాదు వేసవిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అధిక వేడి, పొడి బారిన చర్మం, తగిన మాయిశ్చరైజింగ్ లేకపోవడం, సరైన పాదరక్షలు ధరించకపోవడం వంటివి ప్రధాన కారణాలు మడమలు పగలడానికి దారితీస్తాయి. మడమలు పగలకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాయడం ఎంతో మంచిది.
ఇది కూడా చదవండి: వేసవిలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఇలా తగ్గించుకోండి
చర్మం మృదువుగా..
గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్ర పరిచిన తర్వాత కొబ్బరి నూనెను మసాజ్ చేసి, కాటన్ సాక్స్ ధరించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఇక తేనెను కూడా పాద సంరక్షణంలో ఉపయోగించవచ్చు. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. తర్వాత స్క్రబ్ చేసి, క్రీమ్ రాస్తే మడమల పరిస్థితి మెరుగవుతుంది.
ఇది కూడా చదవండి: ప్రోటీన్ పెరగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయా?
కలబంద జెల్, గ్లిజరిన్‌ను కలిపి రాత్రిపూట అప్లై చేయడం వల్ల మడమల నొప్పి తగ్గి, చర్మం నయం అవుతుంది. కలబందలోని సహజ హీలింగ్ లక్షణాలు చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి. ఇంకా పండిన అరటిపండును కొబ్బరి నూనెతో కలిపి మడమలపై అప్లై చేస్తే అది సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు వేసవిలో మడమలను ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. మడమల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వీటిపై కూడా ముఖం లాగా శ్రద్ధ చూపడం అవసరం.
ఇది కూడా చదవండి: సమ్మర్‌లో ఈ ఫుడ్ అస్సలు తినకండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్
best-health-tips | latest health tips | health tips in telugu | health-tips | cracked heels | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | Latest Life style news | daily-life-style | human-life-style