Neem Leaves: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్‌

వేప ఆకులను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. దురద, చెమట వల్ల వచ్చే వాసన తగ్గుతుంది. చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ నశించడానికి, చర్మానికి సంరక్షణగా పనిచేస్తుంది.

New Update

Neem Leaves: వేసవి కాలం ప్రారంభమైనప్పటికీ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక వేడి, చెమట, ధూళి, కాలుష్యం వల్ల చర్మ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా దురద, మొటిమలు, దుర్వాసన వంటి సమస్యలు ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో వేప ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేపను ఆయుర్వేదంలో ఔషధ మొక్కగా పరిగణిస్తారు. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. 

మొటిమలు తగ్గుతాయి:

దురద, చెమట వల్ల వచ్చే వాసన తగ్గుతుంది. చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ నశించడానికి ఇది సహాయపడుతుంది. వేప నీటిని రోజూ స్నానానికి ఉపయోగిస్తే చర్మానికి సంరక్షణగా పనిచేస్తుంది. ముఖం కోసం వేపతో ఫేస్ మాస్క్ తయారు చేయవచ్చు. తాజా వేప ఆకుల పేస్ట్‌లో ముల్తానీ మిట్టి, తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి. చర్మంలోని మురికిని తొలగించి సహజమైన మెరుపు వస్తుంది. ఇది చర్మాన్ని తాజాగాను, మృదువుగాను ఉంచుతుంది. వేప ఆకులను నమలడం కూడా ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చదవండి: కొబ్బరి నీళ్లు ఇలా తాగితే డేంజర్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

రోజూ ఉదయం కొన్ని ఆకులను నమలడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్లు బయటకు వెళ్లుతాయి. మొటిమలు, నోటి ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు తగ్గుతాయి. వేపలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు చిగుళ్లు, నోటి పూతల వంటి సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేపను వేసవిలో చర్మ సంరక్షణ కోసం వినియోగించడం ఒక మంచి అలవాటు. ఇది సులభంగా లభించడంతోపాటు, దురద, మొటిమలు, చెమట వాసన వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. సహజంగా ఆరోగ్యవంతమైన చర్మం కోసం వేప వాడకాన్ని రోజు జీవితంలో భాగం చేసుకోవడం మేలైన పరిష్కారం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ పెరగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయా?

neem-leaves | neem leaves for skin | neem-leaves-water-bath | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు