Protein and Kidneys
Protein: మూత్రపిండాలు మన శరీరంలో కీలకమైన అవయవాలు. ఇవి శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే నేడు తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా మూత్రపిండాలకు సంబంధించి అనేక సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా శరీరంలో అధిక ప్రోటీన్ స్థాయిలు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్రోటీన్ మితి మీరినప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అధిక ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలు వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపడంలో తక్కువ సామర్థ్యాన్ని చూపుతాయి.
కండరాల బలహీనత..
ఇది మూత్రపిండాల పనితీరు మందగించడానికి దారితీస్తుంది. కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యం క్షీణిస్తుంది. అది ప్రోటీన్ మోతాదుతో ఎలా సంబంధముందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా శరీరంలోని ప్రోటీన్ స్థాయి 6.4 - 8.3 గ్రాములు/ డెసిలిటర్ మధ్య ఉండాలి. ఇది 8.3 కంటే ఎక్కువ అయితే అది ప్రోటీనేమియాగా పరిగణించబడుతుంది. ఇది కండరాల బలహీనత, అలసట, వెన్నునొప్పి, మూత్రంలో మంట, గుండె సమస్యలు వంటి అనేక లక్షణాలతో బయటపడుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: జుట్టుకు హెన్నా వేసే వారికి షాకింగ్ న్యూస్!
ప్రోటీన్ అధికంగా ఉన్న గుడ్లు, చేపలు, చిక్కుళ్ళు వంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. అలాగే తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు వంటి ఫైబర్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే శరీరానికి తగినంత నీటిని అందించడం ద్వారా మూత్రపిండాలకు మేలు చేస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. వీటితో పాటు రోజూ అరగంట అయినా నడక లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరం సమతుల్యతను పొందుతుంది. శరీరంలో ప్రోటీన్ స్థాయిలను క్రమం తప్పకుండా KFT ద్వారా పరీక్షించించుకుంటూ తగినంత జాగ్రత్తలు తీసుకుంటే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సకాలంలో పీరియడ్స్ లేకపోవడం ఈ వ్యాధి లక్షణమా?
( kidneys | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )