Hand Thread: చేతికి దారం ధరించే విధానం.. దాని ప్రాధాన్యత తెలుసుకోండి
జ్యోతిషశాస్త్ర పరంగా మణికట్టు మీద కట్టిన ఎరుపు రంగు దారం కుజుడిని సూచించే శక్తిగా భావిస్తారు. ఇది శక్తిని, విజయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. పసుపు రంగు దారం బృహస్పతికి సంబంధించినది. ఇది జ్ఞానం, పురోగతి, శుభ ఫలితాలను అందిస్తుంది.