Skin Fungal: వేసవిలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఇలా తగ్గించుకోండి

వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం చెమట, సూర్యకాంతి. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం, మురికి సాక్స్, బిగుతు బట్టలు ధరించవద్దు. ప్రతి రోజు సరైన బట్టలు, పరిశుభ్రత, సన్‌స్క్రీన్ వాడకం వల్ల ఆరోగ్యవంతమైన చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Fungal

Skin Fungal

వేసవిలో ఎండ, వేడి వల్ల చర్మానికి గణనీయమైన నష్టం కలుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా బాక్టీరియాల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, సన్ బర్న్ వంటి సమస్యలు చూస్తుంటాం. ముఖ్యంగా ఎక్కువసేపు బయట పనిచేసే వాళ్లకు ఈ సమస్యలు మరింతగా ఎదురవుతాయి. వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం చెమట, సూర్యకాంతి. చెమట బట్టలకు అంటుకుని ఎక్కువసేపు ఉండటం వల్ల ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం, మురికి సాక్స్ లేదా బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.

Also Read :  భర్త ఉన్న స్త్రీ దేవుడికి తలనీలాలు సమర్పిస్తే.. జరిగేది ఇదే!

ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో..

అలాంటి బట్టలు చెమటను పీల్చుకోక పోవడం వల్ల చర్మంపై ఫంగస్ పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి కాటన్ దుస్తులు ధరించడం ఎంతో ముఖ్యం. కాటన్ బట్టలు చెమటను పీల్చుకుని చర్మాన్ని ఎండబెడతాయి, బాక్టీరియాల వృద్ధిని తగ్గిస్తాయి. అలాగే ప్రతి రోజు బట్టలు మార్చుకోవడం, ముఖ్యంగా లోదుస్తులు, సాక్స్ మార్చడం తప్పనిసరి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. వేడి నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్ ఉపయోగించడం కూడా చాలా అవసరం. సూర్యుని కిరణాల వల్ల చర్మం నల్లబడడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. 

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. తెలంగాణలో పెను విషాదం.. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారుల మృతి!

ఎండలోకి బయటకు వెళ్ళేముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. మీరు ఎక్కువసేపు బయట ఉంటే ప్రతి 2 గంటలకు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఇంకా.. వేసవిలో బట్టలు ఉతికేటప్పుడు తేలికపాటి డిటర్జెంట్ వాడాలి. బట్టల్లో సబ్బు మిగిలిపోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది అలెర్జీకి దారితీస్తుంది. బట్టలు పూర్తిగా పొడిపోవాలి, తడిగా ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వేసవిలో ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. సరైన బట్టలు, పరిశుభ్రత, సన్‌స్క్రీన్ వాడకం వల్ల ఆరోగ్యవంతమైన చర్మాన్ని కాపాడుకోవచ్చు.

Also Read :  ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏసీ టెంపరేచర్‌ ఎంత ఉండాలి?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అమ్మాయిలకు చిన్న వయసులోనే పీరియడ్స్ ఎందుకు వస్తాయి?

(best-health-tips | latest health tips | health tips in telugu | fungal-infection | skin | latest-telugu-news | today-news-in-telugu)

Advertisment
తాజా కథనాలు