Seeds Tips: ఒమేగా ఆయిల్స్ ఉండే ఈ గింజలు ఎప్పుడు తినాలో ఇప్పుడే తెలుసుకోండి!!

ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారంలో గింజలు తీసుకోవటం ట్రెండ్‌గా మారింది. అయితే ఏ విత్తనాలు సరైన సమయంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. వివిధ విత్తనాలను ఏ సమయాల్లో తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ అర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Seeds Tips

Seeds Tips

ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారంలో అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా గింజలు వంటి విత్తనాలను (Seeds) తీసుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. అయితే ఏ విత్తనాన్ని ఏ సమయంలో తింటే గరిష్ట ప్రయోజనం ఉంటుందో చాలామందికి తెలియదు. సరైన సమయంలో వాటిని తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. వివిధ విత్తనాలను రోజులో వేర్వేరు సమయాల్లో తీసుకోవడం ద్వారా వాటి లాభాలను పెంచుకోవచ్చు. ఏ గింజలను ఎప్పుడు తినాలో  కొన్ని విషయాలను ఈ అర్టికల్‌లో తెలుసుకుందాం.

ఉదయం పూట తినాల్సిన విత్తనాలు:

అవిసె గింజల్లో (flax-seeds) ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట వీటిని తీసుకోవడం వలన జీవక్రియ (Metabolism) మెరుగుపడుతుంది, హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేనివారికి ఉదయం అవిసె గింజలు తీసుకోవడం మరింత ప్రయోజనకరం. చియా గింజలు (chia-seeds) కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చియా గింజలు నీటిని పీల్చుకుని జెల్ లాగా మారుతాయి. వీటిని స్మూతీలో లేదా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపించి, అతిగా తినడాన్ని నివారించవచ్చు.

మిడ్-మార్నింగ్ స్నాక్స్‌గా..

గుమ్మడి గింజలు (Pumpkin Seeds) జింక్‌కు అద్భుతమైన వనరు. గుమ్మడి గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఆఫీసులో కొద్దిగా ఆకలి వేసినప్పుడు వీటిని తీసుకోవడం మంచి ఎంపిక. అంతేకాకుండా పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds)లో విటమిన్ ఇ,   ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను (Inflammation) తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని కొద్ది మొత్తంలో స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: అంజీర్ పండ్లతో ప్రయోజనం పొందాలంటే ఎప్పుడు ఎలా తినాలో తప్పకుండా తెలుసుకోండి

సాయంత్రం తినాల్సినవి..

పుచ్చకాయ గింజలు (watermelon-seeds)లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేసి అలసటను తగ్గిస్తుంది. సాయంత్రం పూట వీటిని తింటే రోజు మొత్తం అలసట తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది. నువ్వుల్లో (sesame-seeds) కాల్షియానికి మంచి మూలం. సాయంత్రం స్నాక్‌గా కొద్ది మొత్తంలో నువ్వులను తీసుకోవడం వలన ఎముకలు దృఢపడతాయి, శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.

రాత్రి నిద్రపోయే ముందు..

గసగసాల (poppy-seeds)లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వలన మంచి నిద్ర పడుతుంది, మనస్సు రిలాక్స్ అవుతుంది. పొద్దుతిరుగుడు గింజల్లో నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. కాబట్టి వీటిని నిద్రపోయే ముందు కూడా తీసుకోవచ్చు. అయితే అన్ని రకాల విత్తనాలలో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి.. వాటిని ఎల్లప్పుడూ తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదు, సరైన సమయాన్ని పాటిస్తే ఆరోగ్యంలో సానుకూల మార్పులను చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో వేడి నీళ్లను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు