/rtv/media/media_files/2025/11/19/drink-hot-water-2025-11-19-13-57-58.jpg)
Drink Hot Water
జీవితానికి ఆహారం ఎంత అవసరమో.. నీరు కూడా అంతే అవసరం. అందుకే నీరే జీవనాధారం అంటారు. శరీరానికి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు అవసరం. దాహం వేసినప్పుడు నీరు తాగుతాం, చాలామంది భోజనానికి ముందు లేదా తర్వాత కూడా నీరు తాగుతారు. అయితే.. చలికాలంలో దాహం తక్కువగా ఉండటం వలన నీరు తక్కువగా తీసుకుంటాం. ఈ సమయంలో చాలా మంది వేడి నీరు (hot-water) తాగడానికి ఇష్టపడతారు. చలికాలంలో వేడి నీరు తాగితే ఏం జరుగుతుంది..? అలాగే భోజనం తర్వాత వేడి నీరు తాగడం మంచిదేనా అనే సందేహాలు కొందరిలో ఉంటాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. - health tips in telugu
చలికాలంలో వేడి నీటి ప్రయోజనాలు:
సాధారణంగా నీరు తాగడం ఎప్పుడూ మంచిదే. చలికాలంలో గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో చల్లటి నీరు తాగితే జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, గొంతు నొప్పి కూడా రావచ్చు. అందుకే వేడి నీరు తాగడం మంచి ప్రత్యామ్నాయం. వేడి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని మలినాలను చెమట, మూత్రం ద్వారా బయటకు పంపి, శరీరాన్ని నిర్విషీకరణ (Detox) చేస్తుంది. చలికాలంలో రక్తనాళాలు బిగుసుకుపోతాయి..వేడి నీరు వాటిని రిలాక్స్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గు, సైనస్ సమస్యలతో బాధపడేవారికి వేడి నీరు ఉపశమనం కలిగిస్తుంది. - best-health-tips
ఇది కూడా చదవండి: ఈ డ్రై ఫ్రూట్ ధర తక్కువే కానీ.. చలికాలంలో అది అందించే ప్రయోజనాలు మాత్రం ఎక్కువ
భోజనం తర్వాత వేడి నీరు తాగే అలవాటు ఉంటే.. అది జీర్ణక్రియ (Digestion) పనితీరుపై ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరు బాగున్నట్లయితే.. భోజనం తర్వాత వేడి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా భారీ భోజనం (Heavy Meal) చేసినప్పుడు.. వేడి నీరు ఆహారాన్ని త్వరగా విడగొట్టి జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే తేలికపాటి భోజనం చేసినట్లయితే.. సాధారణ నీరు తాగినా సరిపోతుంది. సాధారణంగా తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైములు పలుచబడతాయి. కాబట్టి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు కొద్దికొద్దిగా తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా చలికాలంలో వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తింటే వెంటనే నిద్రొస్తుందా..? నిద్రపోవడానికి ఆయుర్వేదం చెప్పే ఉత్తమ మార్గం ఏమిటో తెలుసుకోండి!!
Follow Us