/rtv/media/media_files/2025/05/03/3ci0EWP481ebGQ4AYpKi.jpg)
Curry leaves
భారతీయులు రోజూ వంటల్లో వాడే ఆకుకూరల్లో కరివేపాకు కూడా ఒకటి. వంటలలో రుచికి, సువాసనకు మాత్రమే ఉపయోగపడతాయని అనుకుని చాలామంది కూరల్లో వేయించిన కరివేపాకును తీసేసేస్తుంటారు. కానీ నిజానికి కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని కేవలం వంటల్లో కాకుండా టీగా తయారు చేసుకుని తాగితే మరింత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.కరివేపాకుతో టీ తయారీ చాలా సులభం. సుమారు 25 నుంచి 30 ఆకులు తీసుకుని బాగా కడిగిన తరువాత ఒక పాత్రలో నీటిని మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ మరిగిన నీటిలో కరివేపాకులను వేసి కొంత సేపు ఉంచితే నీటి రంగు మారుతుంది. ఆ తర్వాత ఆకులను తీసేసి ఆ టీని తాగాలి. ఈ టీని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
Also Read : అఘోరీని జైల్లో కలిసిన ఫ్యామిలీ.. ఎవడ్నీ వదలనంటూ తండ్రి మాస్ వార్నింగ్!
డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఫలితాలు..
ఈ కరివేపాకుల టీ తాగడం వలన జీర్ణశక్తి మెరుగవుతుంది. కరివేపాకులో జీర్ణాశయానికి మేలు చేసే పోషకాలు ఉండటంతో ఇది మలబద్ధకం, డయేరియా, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుందని, డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఫలితాలు ఇస్తుందని పరిశోధనల్లో తేలింది. అలాగే వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ వంటి సమస్యలకు ఇది మంచి ఔషధం. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని వాడవచ్చు. ప్రయాణాలకు ముందు తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే వేసవిలో పెరుగు అస్సలు పాడుకాదు
ఇంకా కరివేపాకులో ఉండే ఫినోలిక్ పదార్థాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ఇన్ఫెక్షన్లు, వాపులను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ టీ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా మేలు చేస్తుంది. సాయంత్రం వేళ ఒక కప్పు కరివేపాకుల టీ తాగడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. రోజు మొత్తం ఎదురైన ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. కరివేపాకుతో తయారైన టీ మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన ఆరోగ్య పానీయం అని వైద్యులు చెబుతున్నారు.
Also Read : లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సరైన నిద్రలేకపోతే శరీరంలో జరిగేది ఇదే
(best-health-tips | latest health tips | health tips in telugu | curry-leaves-water | curry-leaves-benefits | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style)