Curd: ఇలా చేస్తే వేసవిలో పెరుగు అస్సలు పాడుకాదు

ఇంట్లో తయారు చేసిన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పెరుగు త్వరగా చెడిపోవడం ఒక ప్రధాన సమస్య. పెరుగు నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించాలి. ప్లాస్టిక్ కంటైనర్లు వేడి కారణంగా బ్యాక్టీరియాను పెంచే అవకాశం ఉంది.

New Update
Curd

Curd

Curd: వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ బి6, బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పెరుగు త్వరగా చెడిపోవడం ఒక ప్రధాన సమస్య. వేడి వాతావరణంలో పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్ వంటి బాక్టీరియా చర్య వేగంగా జరిగి అది పుల్లగా మారుతుంది. 

ఉప్పు కలిపితే..

మరోవైపు సరిగా నిల్వ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందడం, దాని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే వేసవిలో పెరుగును చల్లగా ఉంచడం, దానిని సరైన విధంగా భద్రపరచడం చాలా అవసరం. పెరుగు నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించాలి. ప్లాస్టిక్ కంటైనర్లు వేడి కారణంగా బ్యాక్టీరియాను పెంచే అవకాశం ఉంది. పెరుగు సిద్ధమైన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎందుకంటే ఇది చల్లదనంలోనే ఎక్కువకాలం నిలుస్తుంది. అలాగే శుభ్రమైన, పొడి పాత్రల్లో పెట్టడం వల్ల కలుషితాన్ని నివారించవచ్చు. పెరుగు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు అందులో చిటికెడు ఉప్పు కలిపితే మంచిది.

ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి హ*త్య

ఇది రుచిని పెంచడమే కాకుండా బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. మధ్యాహ్న భోజన సమయంలో బయటకు తీసుకెళ్లేటప్పుడు ఇన్సులేటెడ్ కంటైనర్ ఉపయోగించాలి. ఇది పెరుగును చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగుపైన పేరుకునే క్రీమ్‌ను తీసేయడం వల్ల కూడా దాని తాజాదనాన్ని కొంత వరకూ నిలుపుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇది తాజాగా ఉంటుంది, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి రసాయనాలు ఉండవు. అయితే బయట కొనుగోలు చేసే పెరుగు విషయంలో గడువు తేదీని పరిశీలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పెరుగు తాజాదనాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో గోండ్ కటిరా-పెరుగు తింటే ఈ సమస్యలు ఉండవు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
తాజా కథనాలు