Sleep
Sleep: ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మందికి నిద్ర ఉండటంలేదు. నిత్యం ఒత్తిళ్లు, భౌతిక శ్రమ, మానసిక కల్లోలంతో నిద్రకు ఆటంకం కలుగుతోంది. అయితే నిద్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో చాలామందికి తెలియదు. మనిషి శరీరానికి నిద్ర ఒక పునరుత్పత్తి ప్రక్రియలా పనిచేస్తుంది. రోజంతా చేసిన శారీరక, మానసిక శ్రమ తర్వాత శరీరం విశ్రాంతి కోరుతుంది. అదే సమయంలో శరీరం పునరుత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించ లేకపోతుంది.
మానసిక స్థితిగతులపైనా ప్రభావం...
దీని ప్రభావం వలన బరువు పెరుగుతుంది, దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా నిద్ర లేమి కారణంగా థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులే కాకుండా మానసిక స్థితిగతులపైనా ప్రభావం పడుతుంది. స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన, కోపం, విసుగు వంటి భావోద్వేగాల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర మెటబాలిజం నెమ్మదించడంతో తీసుకున్న ఆహారంలో సమర్థవంతంగా కాలరీలుగా ఖర్చు కాకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది మళ్లీ అధిక బరువుకు దారి తీస్తుంది.
ఇది కూడా చదవండి: బాగా లావు ఉంటే మెదడు పని చేయదా..?
చర్మం పొడిబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా నిద్రలేమి కారణంగా వస్తాయి. అందుకే తగినంత నిద్ర అవసరం. వైద్య నిపుణుల ప్రకారం ప్రతి రోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం తప్పనిసరి. శరీరానికి అవసరమైనంత విశ్రాంతి కల్పించాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న అలవాట్లతోనే అనేక దీర్ఘకాలిక సమస్యల్ని నివారించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఉదయం పరగడుపున వీటిని తింటే ఎంతో ఆరోగ్యం
( health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )