🛑LIVE BREAKINGS: ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు By Manoj Varma 11 Dec 2024 | నవీకరించబడింది పై 11 Dec 2024 21:30 IST in Latest News In Telugu New Update షేర్ చేయండి Dec 11, 2024 21:30 IST ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31వతేదీ లోగా పూర్తిచేయాలన్నారు. Also Read : https://rtvlive.com/telangana/minister-ponguleti-srinivas-directs-officials-to-comple-indiramma-housing-applications-verification-by-december-31st-8430937 Dec 11, 2024 21:10 IST మంధాన సెంచరీ వృథా.. మూడో వన్డేలోనూ టీమిండియా ఓటమి ఆసీస్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓడిపోయింది. మూడుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మూడోవన్డేలో ఆసీస్ 83పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధన సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. Also Read : https://rtvlive.com/sports/australia-women-won-by-83-runs-against-india-8430887 Dec 11, 2024 21:07 IST వారెవ్వా ఏముందిరా గోల్డ్ క్రెడిట్ కార్డు.. 10 లక్షల మంది వెయిటింగ్ అమెరికాకు చెందిన ఫిన్‌టెక్ అనే సంస్థ రాబిన్‌హుడ్ కూడా ఏకంగా ఓ గోల్ట్ మెటల్ క్రెడిట్ కార్డుని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని తీసుకున్న ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కూడా ఫిదా అయ్యారు. 10 లక్షల మంది ఈ కార్డు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. Also Read : https://rtvlive.com/international/openai-ceo-sam-altman-carries-a-credit-card-made-of-gold-says-it-is-example-of-great-design-8430896 Dec 11, 2024 20:42 IST ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో పుష్ప–2.. అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ఇండియన్ సినిమాను రూల్ చేస్తోంది. ఇంతకు ముందు ఏ సినిమా సాధించలేని విజయాన్ని ఇది సాధించింది. విడుదల అవకముందు నుంచీ హైయ్యెస్ట్ వసూళ్ళతో దూసుకెళుతున్న పుష్ప–2 కేవలం ఆరు రోజుల్లో 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. Also Read : https://rtvlive.com/cinema/puspa-2-movie-reached-to-1000-crore-club-in-six-days-8430844 Dec 11, 2024 19:48 IST ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఈ పరీక్షలు మొదలు కానుండగా.. 19 వరకు జరగనున్నాయి. Also Read : https://rtvlive.com/andhra-pradesh/andhra-pradesh-intermediate-exam-schedule-released-8430709 Dec 11, 2024 19:01 IST పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. Also Read : https://rtvlive.com/andhra-pradesh/10th-class-exams-schedule-released-by-nara-lokesh-8430583 Dec 11, 2024 17:38 IST ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్ రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు. Also Read : https://rtvlive.com/national/stop-using-psbs-as-sources-of-funds-for-fraudulent-friends-rahul-to-modi-govt-8429690 Dec 11, 2024 16:09 IST మోహన్ బాబు ఓ ఉన్మాది.. అల్లం నారాయణ ఫైర్! జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని అల్లం నారాయణ ఖండించారు. ఆయన ఓ ఉన్మాదిలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సమస్య బజారున పడి, కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందన్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. Also Read : https://rtvlive.com/telangana/allam-narayana-fire-on-mohan-babu-attack-on-journalists-telugu-news-8429460 Dec 11, 2024 15:45 IST మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట! నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 24కు విచారణను వాయిదా వేసింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. Also Read : https://rtvlive.com/telangana/mohan-babu-got-relief-in-the-telangana-high-court-telugu-news-8429395 Dec 11, 2024 15:02 IST రేవంత్ హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు.. ఎంపీ అర్వింద్ ఫైర్ గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. హైడ్రాతో హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ను నాశనం చేశారని మండిపడ్డారు. హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు. Also Read : https://rtvlive.com/telangana/mp-arvind-shocking-comments-on-cm-revanth-telugu-news-8429209 Dec 11, 2024 14:58 IST పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లికార్జునరావు మద్యం మత్తులో ఆకతాయిగా బెదిరింపు కాల్ చేసినట్లుగా గుర్తించారు. కాగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఫిర్యాదు మేరకు 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. Also Read : https://rtvlive.com/andhra-pradesh/key-development-on-pawan-kalyan-threating-call-case-8429221 Dec 11, 2024 14:36 IST తెలంగాణలో 10 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను 6 నెలల పాటు రద్దు చేశారు. Also Read : https://rtvlive.com/telangana/10-thousand-driving-licences-banned-in-telangana-8429170 Dec 11, 2024 14:15 IST CM సీటుకు వాస్తు గండం..! KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే రాజకీయాల్లో రాణించాలంటే వాస్తు కలిసిరావాలా..? అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి వాస్తుకు అనుగుణంగా పాలనా కార్యక్రమాలు మార్చుకుంటున్నారు. రాజకీయాల్లో వైస్ జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్‌ల వాస్తు స్టాండ్. Also Read : https://rtvlive.com/politics/telugu-politicians-vastu-sentiment-8428033 Dec 11, 2024 13:48 IST ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!? ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు. https://rtvlive.com/andhra-pradesh/ap-congress-party-senior-leaders-allegations-on-sharmila-telugu-news-8427508 Dec 11, 2024 13:38 IST ఏపీ విద్యార్థుల యూనిఫామ్ ,బ్యాగులు మారాయి! ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి కిట్లు అందిచనుంది.ఈసారి స్కూల్ యూనిఫాం కలర్, బ్యాగ్ కలర్లు మారాయి. https://rtvlive.com/andhra-pradesh/ap-government-finalized-school-students-bags-uniforms-colour-8427489 Dec 11, 2024 13:11 IST అమ్మ ఒడి పేరుతో భారీ సైబర్ స్కాం.. ఐడీ అప్‌డేట్ చేస్తామంటూ! సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను బురిడీ కొట్టించారు. 'అమ్మ ఒడి' పేరిట కర్నూలు అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.26,500 కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. https://rtvlive.com/andhra-pradesh/cyber-scam-in-ap-amma-odi-scheme-telugu-news-8427307 Dec 11, 2024 12:56 IST మా నాన్న చేసిన తప్పు అదే.. మంచు విష్ణు సంచలనం! మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని 4,5 రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. https://rtvlive.com/cinema/manchu-vishnu-reacts-on-mohan-family-issues-8427356 Dec 11, 2024 12:23 IST 'పుష్ప2' వివాదం.. ఎట్టకేలకు స్పందించిన రాజేంద్ర ప్రసాద్ 'పుష్ప2' వివాదంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ అని తెలిపాడు. https://rtvlive.com/cinema/pushpa-2-controversy-rajendra-prasad-finally-responds-8427244 Dec 11, 2024 12:18 IST BREAKING: మోహన్ బాబు కంటికి గాయం.. హెల్త్ బులిటెన్ విడుదల! మోహన్ బాబు ఆరోగ్యంపై ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆయన కంటి కింద గాయమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. https://rtvlive.com/cinema/mohan-babu-health-bulletin-released-8427268 Dec 11, 2024 11:53 IST BREAKING: హైకోర్టుకు మోహన్ బాబు! నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు. https://rtvlive.com/cinema/actor-mohan-babu-filed-petition-in-telangana-high-court-8427194 Dec 11, 2024 11:50 IST 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్ సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. అందులో.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాసుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. https://rtvlive.com/cinema/samantha-wedding-in-2025-post-going-viral-8427083 Dec 11, 2024 11:36 IST మోహన్ బాబుపై కేసు.. మూడేళ్ళ జైలు శిక్ష? మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్ పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై BNS118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబుకు ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. https://rtvlive.com/cinema/case-registered-on-actor-mohan-babu-8426699 Dec 11, 2024 11:28 IST Mohan Babu : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..! మోహన్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో ఆయన గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నారు. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. https://rtvlive.com/cinema/mohan-babu-admitted-to-the-hospital-8426690 Dec 11, 2024 11:27 IST BIG BREAKING : మా నాన్న దేవుడు.. మీడియాకి మంచు మనోజ్ క్షమాపణలు మంచు మనోజ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ..మీడియాకి క్షమాపణ కోరారు. మా అన్న, మా నాన్న తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియా మీద దాడి చేయడం బాధ కలిగించిందని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. https://rtvlive.com/cinema/manchu-manoj-apologizes-to-the-media-8427106 Dec 11, 2024 11:18 IST AP Liquor : ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కేవలం 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. https://rtvlive.com/andhra-pradesh/liquor-sales-surge-in-ap-last-55-days-8426771 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి