వారెవ్వా ఏముందిరా గోల్డ్‌ క్రెడిట్ కార్డు.. 10 లక్షల మంది వెయిటింగ్‌

అమెరికాకు చెందిన ఫిన్‌టెక్ అనే సంస్థ రాబిన్‌హుడ్‌ కూడా ఏకంగా ఓ గోల్ట్‌ మెటల్ క్రెడిట్‌ కార్డుని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని తీసుకున్న ఓపెన్ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్ కూడా ఫిదా అయ్యారు. 10 లక్షల మంది ఈ కార్డు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.

New Update
CREDIT

ఒకప్పుడు క్రెడిట్ కార్డుని చాలా తక్కువ మంది వాడేవారు. ఇప్పుడు చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వివిధ రకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మాములు మెటల్‌ కార్డులే. అయితే అమెరికాకు చెందిన ఫిన్‌టెక్ అనే సంస్థ రాబిన్‌హుడ్‌ కూడా ఏకంగా ఓ గోల్ట్‌ మెటల్ కార్డును తీసుకొచ్చింది. ఈ డిజైన్‌ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్ కూడా ఫిదా అయ్యారు. ఈ కార్డు అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.   

Also Read: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్

Gold Credit Card

ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల క్రితం రాబిన్‌ హుడ్ సంస్థ తనకు ఈ గోల్డ్ క్రెడిట్‌ కార్డు పంపించినట్లు ఆల్ట్‌మన్‌ ఎక్స్‌లో షేర్ చేశారు. అప్పుడు దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకొని విస్మరించినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని.. ఈ డిజైన్ ఎంతగానో బాగుందంటూ రాసుకొచ్చారు. అలాగే రాబిన్ హుడ్ సీఈవో వ్లాడ్‌ టెనెవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

Also Read :  మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!

Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

ఈ గోల్డ్‌ మెటల్ క్రెడిట్ కార్డు విషయానికొస్తే.. రాబిన్‌హుడ్ అనే సంస్థ రిటైల్‌ బ్రోకరేజీ సర్వీసులు అందిస్తుంటోంది. అయితే నెల రోజుల క్రితమే ఈ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డును రిలీజ్ చేసింది. దీన్ని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేశారు. గోల్డ్ కోటింగ్ ఉంటుంది. 17 గ్రాముల బరువుంటుంది. 10 క్యారెట్ల స్వచ్ఛతతో తయారుచేసిన ఈ గోల్డ్‌ కార్డును ఎంపిక చేసిన వారికే సంస్థ అందిస్తుంది.     

Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఫైర్

వీసా నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ కార్డుతో అన్ని కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని సంస్థ పేర్కొంది. వార్షిక రుసుము కూడా లేదని, ఇంకా విదేశీ లావాదేవీలపై కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పనిలేదని చెప్పింది. ప్రస్తుతం ఈ గోల్డ్ క్రెడిట్‌ కార్డు కోసం అమెరికాలో డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఏకంగా 10 లక్షల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు