Hyderabad : నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24కు విచారణను వాయిదా వేసింది. పోలీసుల ముందు విచారణకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలీసులు మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని ఆదేశాలు.
Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
హెల్త్ బులిటెన్..
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటెల్ ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబు ఆరోగ్యంపై ఆస్పత్రి బృందం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి కింద దెబ్బ తాకినట్లు గుర్తించింది. బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
మా నాన్న చేసిన తప్పు అదే..
మరోవైపు మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవడం దురదృష్టకరమని, అతని కుటుంబంతో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. ఇక ఉమ్మడి కుటుంబంలో దురదృష్టవశాత్తూ ఇలా జరిగిందని అన్నాడు. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి, ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ
Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!