తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన , గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీలపెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం ఆయన సచివాలయలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Also Read: వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు! Minister Ponguleti Srinivas ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ " ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31వతేదీ లోగా పూర్తిచేయాలి. పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి ఐదు వందల మందికి ఒక ఉద్యోగిని( సర్వేయర్) నియమించుకోవాలి. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్ అంతేగాక స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్‌లు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలి. సర్వే వివరాలపై ప్రతి రోజూ కలెక్టర్‌లు సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ. ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామని" కలెక్టర్లకు మంత్రి సూచించారు. Also Read: ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్ Also Read: మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!