Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లికార్జునరావుపై మంగళగిరి పోలీసులు FIR నమోదు చేశారు. నిన్న నిందితుడిని గంట పాటు పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా విచారణలో పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు నిందితుడు. మద్యం మత్తులో ఆకతాయిగా బెదిరింపు కాల్ చేసినట్లుగా విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. కాగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఫిర్యాదు మేరకు 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ పవన్ ను లేపేస్తాం... ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ వచ్చింది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే పవన్‌ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టాడు. దీంతో ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ కళ్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించారు. Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! హోంశాఖ మంత్రి అనిత రియాక్ట్.. అదే సమయంలో పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని డీజీపీ ద్వారక తిరుమల రావు మంత్రి అనితకు వివరించారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత.. పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంపై ఆరా తీశారు. Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!