BIG BREAKING: మోహన్ బాబుపై కేసు.. మూడేళ్ళ జైలు శిక్ష?

మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్ పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై BNS118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబుకు ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

author-image
By V.J Reddy
New Update
Mohan Babu

Mohan Babu: మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి రిపోర్టర్ చేతిలోని లోగో లాక్కొని అతని తలపై మోహన్ బాబు బలంగా కొట్టిన విషయం తెలిసిందే. రిపోర్టర్ పై దాడి చేసినందుకు ఆయనపై BNS118 సెక్షన్ కింద షహర్ పహాడీ పీఎస్ లో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వ్యతిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ నోటీసులు పంపించారు.

మోహన్ బాబు నేరం రుజువైతే ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు మోహన్ బాబు దాడి చేసిన రిపోర్ట్ రంజిత్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అతని దవడపైన ఉండే జైగోమాటిక్ ఎముక మూడు చోట్లు విరిగిందని వైద్యులు నిర్థరించారు. రిపోర్ట్ కు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. రిపోర్ట్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. 

గన్స్‌ సీజ్..

మంచు మోహన్ బాబు, విష్ణుల నుంచి లైసెన్స్ గన్స్‌ను  స్వాధీనం చేసుకోవాలని రాచకొండ కమిషనరేట్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఆదేశాలు పంపింది. జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మంచు విష్ణు, మోహన్ బాబుల గన్స్ కు వాడుతున్నారు. వారి ఫ్యామిలీ గొడవల కారణంగా పోలీసులు వాటిని హ్యాడ్ ఓవర్ చేసుకోనున్నారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు