ప్రపంచవ్యాప్తంగా పుష్ప–2 హవా కొనసాగుతోంది. విడుదల అవ్వకముందు నుంచీ రికార్డ్‌లతో దూసుకెళుతున్న ఈ సినిమా ఇప్పుడు ఏ భారతీయ సినిమా సాధించని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తాజాగా ఇది రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన 6 రోజుల్లోనే రూ.1002 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీ అయింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డ్ చేసింది. ఇప్పుడు ఐదు రోజుల్లో వెయ్యి కోట్లు సాధించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
Also Read : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!
THE BIGGEST INDIAN FILM rewrites history at the box office 💥💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to cross 1000 CRORES GROSS WORLDWIDE in 6 days ❤🔥#PUSHPA2HitsFastest1000Cr
— Pushpa (@PushpaMovie) December 11, 2024
Sukumar redefines commercial cinema 🔥
Book your tickets now!
🎟️… pic.twitter.com/c3Z6P5IiYY
Also Read : మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!
Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు
అల్లు అర్జున్‌పై ప్రశంసలు..
పుష్ప–2 సినిమాలో అల్లు అర్జున్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బన్నీ అంత బాగా ఇంకెవరూ చేయలేరు అని కామెంట్ చేస్తున్నారు. పెద్ద యాక్టర్లు సైతం బన్నీ గురించి సోషల్ మీడియాలో పసట్‌లు పెడుతున్నారు. అల్లు అర్జున్ కేరీర్‌లోనే ఇది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని చెబుతున్నారు. అతని నటన చూపు తిప్పుకోనివ్వడం లేదని అంటున్నారు. దీని తర్వాత నేషనల్ క్రష్ రష్మిక, పాహద్ ఫాజిల్ యాక్టింగ్ కూడా మంచి పేరు వచ్చింది.
Also Read: Cricket: టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్–30 నుంచి రోహిత్ అవుట్..