BREAKING: మోహన్ బాబు కంటికి గాయం.. హెల్త్ బులిటెన్ విడుదల! మోహన్ బాబు ఆరోగ్యంపై ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆయన కంటి కింద గాయమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. By V.J Reddy 11 Dec 2024 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Mohan Babu: అస్వస్థతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు ఆరోగ్యంపై ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన కంటి కింద గాయమైనట్లు తెలిపారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సిటీ స్కాన్ తీయాల్సి ఉంది.. చికిత్సకు అవసరమైన ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. మోహన్ బాబు మరో రెండు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా నిన్న జల్‌పల్లిలో తన నివాసం ఎదుట జరిగిన ఘర్షణలో ఓ ఛానెల్ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేశారు. ఆ ఛానెల్ కు సంబంధించిన మైక్ ను లాక్కొని.. రిపోర్టర్ పై మైక్ తో పిడిగుద్దులు గుద్దారు. దీంతో రిపోర్టర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మీడియాపై దాడి చేస్తారా అంటూ మోహన్ బాబుపై అక్కడున్న జర్నలిస్టులు సీరియస్ అయ్యారు. బయటకు రావాలి అంటూ ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆ కొద్దీ సేపటికి మోహన్ బాబు అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబు భార్య ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్... నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి