BREAKING: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.  

New Update
EXAM

ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు మెరుగ్గా ప్రీపేర్‌ అయ్యేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు రోజు విడిచి రోజు ఉండేలా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందిచామని లోకేష్ తెలిపారు. ఈ సమయాన్ని వినియోగించుకొని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని చెబుతూ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

Also Read: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్..!

మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ‘‘ మీ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టడానికి, సరిగ్గా ప్లాన్ చేయడానికి ఇది ఉత్తమమైన సమయం. ఒత్తిడి లేకుండా ఉండండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఉత్తమ ప్రయత్నం చేయండి.’’ అంటూ లోకేష్ ట్వీట్‌ చేశారు.

Advertisment
తాజా కథనాలు