Rahul Gandhi: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఫైర్

రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు.

New Update
Rahul Gadhi

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదానీ వ్యవహారంపై మాట్లాడాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విపక్ష నేత రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు. ఆల్‌ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ బుధవారం భేటీ అయ్యారు. 

Also Read: 11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే?

Rahul Gandhi - PM Modi

ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా పలు అంశాలను రాసుకొచ్చారు. '' ప్రజాప్రయోజనాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనివల్ల వాళ్లు ప్రజలకు సమర్థవంతంగా సేవలు చేయలేకపోతున్నారు. సిబ్బంది  కొరత ఉండటం, క్లిష్టమైన పని వాతావరణం ఉన్నప్పటికీ వారు సాధ్యకాని టార్గెట్‌లు చేరుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలు ఇవ్వడం లేదు. ఉద్యోగంలో పురోగతి కల్పించడం లేదు.   

Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

ప్రజలందరీ కోసం ప్రభుత్వ బ్యాంకులు పనిచేయాలి. ఎంతోమందికి జీవనాడిగా ఉన్న ఈ బ్యాంకులను మోదీ ప్రభుత్వం కొన్ని ధనిక, శక్తిమంతమైన సంస్థలకు ప్రైవేట్‌ ఫైనాన్షియర్లుగా మార్చేశాయి. తమ మోసపూరిత స్నేహితుల కోసం అపరిమిత నిధులు ఇచ్చే వనరులుగా ప్రభుత్వ బ్యాంకులను వాడుకోవడం మోదీ సర్కార్‌ ఆపేయాలని'' రాసుకొచ్చారు.   

Also Read :  అప్పు చేసి పప్పుకూడు.. ప్రభుత్వ పాఠశాలల్లో దారుణ పరిస్థితి

Also Read: ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్

ఇదిలాఉండగా.. రాహుల్‌గాంధీ బుధవారం పార్లమెంటులో లోక్‌సభ స్కీకర్ ఓం బిర్లాను కలిశారు. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ నేతలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యల రికార్డులను తొలగించాలని కోరారు. ఇందుకు స్పీకర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. సభా కార్యకలాపాలు కొనసాగాలనే మేము కోరుకుంటున్నామని రాహుల్ అన్నారు. అలాగే డిసెంబర్ 13న పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ జరగాలని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు