మా నాన్న చేసిన తప్పు అదే.. మంచు విష్ణు సంచలనం!

మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని 4,5 రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
gdvv

Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయని అన్నారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరం అని అన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!

మా అక్కతో కూడా ఇస్యూస్ ఉన్నాయ్...

మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు తన కుటుంబం గురించి ప్రెస్ మీట్ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉండడం సహజమే అని అన్నారు. కానీ అవి ఇంటి వరకే పరిమితం అయితే బాగుటుందని.. తాము కూడా తమ కుటుంబంలో నెలకొన్న విభేదాలను ఇంట్లోనే పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తనకు కూడా తన అక్క మంచు లక్ష్మితో కూడా ఇస్యూస్ ఉన్నాయని చెప్పారు. కానీ తాము మర్యాద పూర్వకంగా నడుచుకుంటామని తెలిపారు. తన అక్క తనకంటే పెద్దదని.. ఆమె చెప్పిన కొన్ని విషయాలను నేను పాటిస్తానని అన్నారు. కానీ ఏనాడూ కుటుంబలో చీలికలు రావాలని కోరుకోలేదని అన్నారు.

మీకు దండం పెడుతా...

రిపోర్టర్ పై మోహన్ బాబు చేసిన దాడిపై మంచు విష్ణు సారీ చెప్పారు. మోహన్ బాబు వాంటెడ్ గా చేసిన దాడి కాదని అన్నారు. కేవలం అక్కడ జరిగిన పరిస్థితుల్లో మోహన్ బాబు అలా చేశారని చెప్పుకొచ్చారు. ముఖంపై మైక్‌ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. గతంలో ఎప్పుడూ కూడా మోహన్ బాబు మీడియాపై ఇలా దాడి చేసిన సంఘటనలు లేవని అన్నారు. గాయపడిన జర్నలిస్ట్ కుటుంబం తో తాను మాట్లాడని అన్నారు. ఆయనకు అయ్యే ఆసుపత్రి ఖర్చు భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇకనైనా తమను వదిలి పెట్టాలని మీడియాను కోరారు. తమ కుటుంబంలో నెలకొన్న సమస్యలపై ప్రచారాలు ఇకనైనా ఆపాలని వేడుకున్నారు. 

Also Read: Techie Suicide: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

Advertisment
తాజా కథనాలు