TG News : జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఖండించారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. ఈ మేరకు మీడియా ప్రతినిధి రంజిత్ పై నటుడు మోహన్ బాబు దాడి ఘటనకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు. సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణతోపాటు భారీ ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి ధర్నా చేశారు.
Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు
కుటుంబ సమస్య బజారున పడితేనే..
దాడి జరిగి రోజు గడుస్తున్నా మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాక.. కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుంది. మీడియాపై నిన్న జరిగింది ముమ్మటికీ క్రూరమైన దాడే. మోహన్ బాబుపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లం నారాయణ.
ఇది కూడా చదవండి: రూ.3.3 కోట్ల 1,100 సెల్‌ఫోన్లు స్వాధీనం.. బాధితులకు అందించిన పోలీసులు
ఇక ఐక్య పోరాటాలతో జర్నలిస్టుల హక్కులను సాధించుకుందామని, జర్నలిస్టులు సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘం బలోపేతానికి మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి దాకా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కన్వీనర్ రవి నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి హనుమయ్య, యోగానంద స్వామి, యూనియన్ నేతలు ధీకొండ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.