టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. దీంతో స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌ను ఆసీస్ మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Also Read : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!
స్మృతి మంధన సెంచరీ వృథా
ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 83 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 రన్స్ చేసింది. అందులో ఆసీస్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీతో చెలరేగింది. దాదాపు (110) పరుగులు చేసి అదరగొట్టేసింది.
Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!
అలాగే కెప్టెన్ తహిళ మెక్‌గ్రాత్ (56 *) పరుగులు చేసింది. ఇంకా ఆష్లే గార్డ్‌నర్ (50) పరుగులు చేసింది. ఇలా ఒకరు సెంచరీ, మరో ఇద్దరు అర్థ సెంచరీలతో అదరగొట్టేశారు. మొత్తంగా 298 పరుగులు చేశారు. అదే సమయంలో భారత బౌలర్లు కూడా రాణించారు. అరుంధతి రెడ్డి 4 వికెట్లు, దీప్తి శర్మ 1 వికెట్ పడగొట్టారు.
ఇక ఆసీస్ చేసిన స్కోర్‌ను ఛేదించేందుకు భారత మహిళా టీం రంగంలోకి దిగింది. ఇందులో ఓపెనర్‌గా దిగిన స్మృతి మంధాన దంచికొట్టింది. ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించింది. 105 పరుగులు చేసి ఔరా అనిపించింది. 109 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగిపోయింది.
ఆమె తర్వాత హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్‌లో ఉంది. మిగతా టీం ప్లేయర్స్ సపోర్ట్ చేయకపోవడంతో మంధన సెంచరీకీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 45.1 ఓవర్లలో 215 పరుగులకే భారత మహిళా జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ 83 పరుగులు తేడాతో విజయం సాధించింది.