/rtv/media/media_files/2025/04/21/V3lBSUVMsLyqt1rhs5JN.jpg)
hegset
అమెరికా బలగాలు ఇటీవల యెమెన్ పై భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ దాడికి ముందే దీనికి సంబంధించిన ప్రణాళిక బహిర్గతం అయినట్లు కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడులకు రహస్యాలను స్వయంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది. తన ఫ్యామిలీ గ్రూప్ చాట్ లో దీని గురించి చర్చించారట.
Also Read: Israel: సైన్యం తప్పువల్లే ఆ మరణాలు.!
ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 15న యెమెన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడులను ప్రకటించారు. అయితే అంతకంటే ముందే సిగ్నల్‌లోని గ్రూప్ చాట్ ద్వారా ఈ యుద్ధ ప్రణాళిక బయటకు వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే సమయంలో రక్షణ మంత్రి హెగ్సెత్ కూడా రెండో సిగ్నల్ చాట్ ను ఉపయోగించి ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు చెప్పినట్లు తాజా కథనం వెల్లడించింది.
Also Read: Tirumala: తిరుమలకు వచ్చే వారు అలా చేయడం మంచి పద్దతి కాదు.. !
తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్‌తో ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది.హెగ్సెత్ భార్య..ఫాక్స్ న్యూస్ లో మాజీ ప్రొడ్యూసర్ ఇక సోదరుడు హోంల్యాండ్ డిపార్ట్ మెంట్ లో సీనియర్ అడ్వైజర్ గా పని చేస్తున్నారు. అంతకు ముందు హెగ్సెత్ ,ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర ముఖ్య అధికారులు ఉన్న సిగ్నల్ గ్రూప్ చాట్‌నుంచి ఈ యుద్ధ ప్రణాళికలు బయటకు వచ్చాయి.
ఈ చాట్ లో ద అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ కూడా ఉన్నారు.యెమెన్ పై దాడుల గురించి చర్చించడానికి రెండు రోజుల ముందే తనను ఆ గ్రూప్ లో చేర్చాలని జెఫ్రీ కోరారు. ఈవిషయాన్ని వైట్‌హౌస్ కూడా ధ్రువీకరించింది. ఈ లీక్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హెగ్సెత్, ట్రంప్ ప్రభుత్వం పై విమర్శు వస్తున్న వేళ తాజా కథనం వెలువడటం మరింత ఆందోళనకరంగా మారింది.
రక్షణ మంత్రిని తొలగించాలని ప్రతిపక్ష డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.తాజా కథనాల పై పెంటగాన్, వైట్‌హౌస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.అయితే హెగ్సెత్ పై గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి.రక్షణ శాఖకు సంబంధించిన అధికారిక, రహస్య సమావేశాలకు భార్య, సోదరుడిని వెంటబెట్టుకునే వెళ్లేవారని ఆ మధ్య కథనాలు వచ్చాయి.
Also Read:Bollywood:లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో హీరో ను చంపేస్తామంటూ బెదిరింపులు!
america | yemen | israel attack on yemen | israel attacks on yemen | trump | pete-hegseth | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | international-news | international news in telugu | international news telugu | latest-international-news