/rtv/media/media_files/2025/04/20/MbQr5zODo9qkrmEMCNp8.jpeg)
దేశ ఐటీ రాజధాని నగరంలో కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద హత్య సంచలనంగా మారింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆయన నివాసంలో ఓంప్రకాష్ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఆయన భార్య పల్లవిని ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆస్తి తగాదాల వల్ల ఓం ప్రకాశ్ హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
హత్యకు ముందు పల్లవి తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని, కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసలు పెడుతున్నాడని చెబుతూ ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. ఇది జరిగిన రెండు రోజులకే ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. ఆయనను పొడిచి చంపిన ఆ తరువాత ఒక మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్’ అని ఓం ప్రకాష్ భార్య మెసేజ్ చేశారు. గొడవలు మరింత ఎక్కువ కావడంతో భర్తను పలుసార్లు పొడిచి హత్య చేసిన తర్వాత, ఒక మాజీ డీజీపీకి ఫోన్ చేసి "నేను రాక్షసుడిని చంపాను" అని చెప్పింది.
Also Read: Israel: సైన్యం తప్పువల్లే ఆ మరణాలు.!
డీజీపీ అలోక్ మోహన్, నగర కమిషనర్ బి. దయానంద్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పల్లవి, ఆమె కూతురు, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలిలో పదునైన ఆయుధం గుర్తించినట్టు ఏసీపీ (వెస్ట్) వికాశ్ కుమార్ వెల్లడించారు. డీజీపీ మృతదేహం సమీపంలో ఇది ఉందని చెప్పారు. ఆయనను దీంతోనే పొడిచారా? మరేదైనా ఆయుధం వినియోగించారా? అనేది తేలాల్సి ఉందన్నారు. కుమారుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు.
మాజీ డీజీపీ ప్రకాశ్ హత్య జరిగిన సమయంలో ఆయన భార్య పల్లవి, కుమార్తె ఉన్నారని తెలుస్తుంది. పోలీసుల అక్కడకు చేరుకునేసరికి ఇరువూరు వేరే గదిలో గడియ పెట్టుకుని ఉన్నారని పేర్కొన్నాయి. ఇక, బిహార్‌కు చెందిన ఓం ప్రకాశ్.. 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. బళ్లారి అదనప్పు ఎస్పీగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. పలు జిల్లాలకు ఎస్పీగా.. డీఐజీ (క్రైమ్ బ్రాంచ్), తర్వాత 2017లో డీజీపీగా పదోన్నత పొందారు. 2017లో పదవీవిరమణ అనంతరం.. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
Also Read: Tirumala: తిరుమలకు వచ్చే వారు అలా చేయడం మంచి పద్దతి కాదు.. !
karnataka | murder | dgp | Former DGP | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | national-news