Israel: సైన్యం తప్పువల్లే ఆ మరణాలు.!

గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది

New Update
israel

Attacks On Gaza

గాజా గత నెలలో ఓ వాహన శ్రేణి పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు. ఈ విషయంలో ఐడీఎఫ్‌ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.దీంతో ఈ ఘటన పై సైనిక దర్యాప్తునకు ఆదేశించగా..దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.

Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!

ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది.  మార్చి 23 తెల్లవారుజామున రఫాలోని టెల్‌ అల్‌ సుల్తాన్‌ జిల్లాలో అంబులెన్సుల పై ఓ ఐరాస వాహనం పై ఇజ్రాయెల్‌ సేనలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ సభ్యులు,ఆరుగురు పౌరసిబ్బంది, ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు. 

Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!

ఇజ్రాయెల్ దళాలు అంతటితో ఆగకుండా వారి వాహనాలను ధ్వంసం చేశాయి. మృతదేహాలను సామూహికంగా ఖననం చేశాయి. ఇది జరిగిన వారం రోజులు తరువాత ఐరాస, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని..మృతదేహాలను బయటకు తీశాయి.మృతులను అతి సమీపం నుంచి లక్ష్యంగా చేసుకున్నారని పాలస్తీనా రెడ్ క్రీసెంట్‌ సొసైటీ చీఫ్‌ వెల్లడించారు.

ఘటన సమయంలో వాహనాలకు ఎటువంటి ఎమర్జెన్సీ సిగ్నల్స్ లేవని ఇజ్రాయెల్‌ తొలుగ పేర్కొంది. అయితే వైద్య బృందంలో ఒకరి సెల్‌ఫోన్‌ నుంచి సేకరించిన వీడియో ఫుటేజీ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో వెనక్కితగ్గిన సైన్యం..ఈ ఘటన పై విచారణకు ఆదేశించింది. చీకట్లో సంబంధిత వాహనాలను హమాస్‌ మిలిటెంట్లకు చెందినవిగా ఐడీఎఫ్‌ డిప్యూటీ బెటాలియన్‌ కమాండర్‌ అంచనా వేసినట్లు తేలింది.

అయితే ఘటనా స్థలం నుంచి సేకరించిన వీడియోలో మాత్రం అంబులెన్సుల లైట్లు వెలుగుతున్నట్లు కనిపించాయి. తమ దళాలు పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ  ఘటన చోటు చేసుకుందని సైన్యం తెలిపింది. ఐరాస సిబ్బంది వాహనం పై దాడిని ఆదేశాల ఉల్లంఘనగా పేర్కొంది. అంబులెన్సులను ధ్వంసం చేయాలనే నిర్ణయం తప్పేనని..అయితే ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేయలేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా..హమాస్‌ తన ఫైటర్లను అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాల్లో తరలిస్తోందని ,ఆస్పత్రులు,ఇతర పౌర సదుపాయాల్లో దాచిపెడుతోందని ఇజ్రాయెల్‌ పలు సందర్భాల్లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులను సమర్థించుకుంటోంది.అయితే , వైద్య యంత్రాంగంఈ ఆరోపణలను ఖండించింది.

Also Read: Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

Also Read: USA: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు

gaza | israel | attacks | commander | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | international-news | international news in telugu | international news telugu | latest-international-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు