/rtv/media/media_files/2025/04/21/1UfxoTQl3K31vubyIwAy.jpg)
abhinav
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు పంజాబ్,చండీగఢ్ పోలీసులును ట్యాగ్ చేశాడు.
శుక్లా షేర్ చేసిన వివరాల ప్రకారం..అతడి సోషల్ మీడియా అకౌంట్‌కు ఒక వ్యక్తి నుంచి సందేశం వచ్చింది.అందులో నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని.నాకు మీ ఇంటి చిరునామా తెలుసు. ఇటీవల సల్మాన్ ఇంటి పై కాల్పులు జరిపినట్లే మీ ఇంటి పై కూడా జరుపుతాం.ఇదే మీకు చివరి హెచ్చరిక. అసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి.
Also Read: Tirumala: తిరుమలకు వచ్చే వారు అలా చేయడం మంచి పద్దతి కాదు.. !
లేదంటే బిష్ణోయ్ గ్యాంగ్ లిస్ట్ లో మీ పేరు చేరుతుంది అని ఆ సందేశంలో ఉంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు , భద్రతా సిబ్బందికి కూడా బెదిరింపులు వచ్చాయని అభినవ్ తెలిపారు. ఆ బెదిరింపులు పంపిన వ్యక్తి ఇన్ స్టా గ్రామ్ వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. అతడి నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విజ్ఙప్తి చేశారు.
అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.ఇటీవల అభినవ్ భార్య రుబీనాకు,బిగ్ బాస్ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్ కు మధ్య వాగ్వాదంజరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఇది మరింత ముదరడంతో అసిమ్ పై అభినవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అసిమ్ అభిమానులు ఈ హీరోకు బెదిరింపులు పంపుతున్నారు. తాజాగా వచ్చిన సందేశం కూడా అతడి అభిమానులే పంపినట్లు కొందరు ఆరోపించారు.
Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
bollywood | salman-khan | bollywood-actor | Lawrence Bishnoi Gang | lawrence bishnoi salman khan | gangster lawrence bishnoi | lawrence bishnoi gangster | abhinav Sukhla | cinema-news | cinema news in telugu | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates