/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
TTD
తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అడిషనల్ ఈవో చిన్న రిక్వెస్ట్ చేశారు. తిరుమలలో రోడ్లపై చెత్త వేయడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నా, భక్తులు ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లను రోడ్లపై పడేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డులో చెత్తను తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
Also Read: Israel: సైన్యం తప్పువల్లే ఆ మరణాలు.!
కుంకాల పాయింట్ వద్ద స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 400 మంది టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.తిరుమల పుణ్యక్షేత్రంలో పరిశుభ్రత పాటించాలని టీటీడీ కోరుతోందన్నారు అడిషనల్ ఈవో. వాహనాల్లో వచ్చే భక్తులు రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని కోరారు. తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధించారు. అయినా భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తెచ్చి రోడ్లపై పడేస్తున్నారు. దీనివల్ల చాలా చెత్త పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. అందుకే మొదటి ఘాట్ రోడ్డులో చెత్త తొలగించాలని నిర్ణయించారు. రోడ్లపై చెత్త వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేశారు. భక్తులు చెత్తను డస్ట్ బిన్ లలో మాత్రమే వేయాలని తెలిపారు.
Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
వాహనాల్లో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త వేయడం మంచి పద్ధతి కాదన్నారు. తిరుమలను శుభ్రంగా ఉంచడానికి 6 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు వెంకన్న చౌదరి. వారి కృషిని, తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. భక్తులు వాహనాల నుంచి బయటకు చెత్త విసరొద్దని.. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని ఆయన భక్తులను కోరారు.
వారి దర్శనార్థం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్షయ కిచెన్ ను తనిఖీ చేసి భక్తుల కోసం తయారు చేస్తున్న అన్న ప్రసాదాలను రుచి చూశారు. ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ అధిక రద్దీ కారణంగా దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతుండటంతో ఎలాంటి ఆందోళన చెందకుండా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
Also Read: Mohan Bhagwat: కుల భేదాలకు స్వస్థి పలుకుదాం.. హిందువులకు మోహన్ భగవత్ సూచనలు
tirumala | ttd | ttd-eo | ap | ap-news | ap news today | tirumala-news | tirumala news update | latest-telugu-news | latest telugu news updates | latest-news | telugu-news not present