🔴Live Breakings: తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లు కుదేలు పడుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4 శాతం పడిపోగా దక్షిణ కొరియా మార్కెట్లు 1.9 శాతం కుంగాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా కుదేలు పడ్డాయి. బంగారం ధర కూడా పరిగెడుతోంది.
ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.
ఫోర్బ్స్ బిలియనీర్ 2025 జాబితా విడుదలైంది. 342 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మొదటిస్థానంలో ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10లో ఉన్న అంబానీ, ఈసారి 18వ స్థానానికి పడిపోయాడు. అదానీ 28వ ప్లేస్‌లో ఉన్నారు.
బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని, వీటికి సరైన చట్టం అవసరమని జస్టిస్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
2025 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా రిలీసైంది. అందులో అత్యంత సంపన్నురాలుగా సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 35.5 బిలియన్ డాలర్లు అంటే.. రూ.3 లక్షల 34 వేల కోట్లుగా చెప్పుకోవచ్చు. టాప్ 10 ఇండియన్ బిలియనీర్ల జాబితాలో ఆమె 3వ స్థానంలో ఉన్నారు.
శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి చెబుతుంది.
అమెజాన్ వేసవిలో కూలర్లపై ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ ఫ్రియో 23L న్యూ పర్సనల్ కూలర్ రూ.4,899కి కొనుక్కోవచ్చు. కెన్‌స్టార్ పల్స్ HC 20 పోర్టబుల్/రూమ్/పర్సనల్ కూలర్ రూ.రూ.3,990కి, హావెల్స్ కల్ట్ ప్రో 17L పర్సనల్ ఎయిర్ కూలర్‌ను రూ.4,099కే సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో మరో మోడల్‌ను పరిచయం చేయనుంది. టాటా నానో ఈవీ 2025 కార్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. దీని ధర రూ.6లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 200కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని సమాచారం.