Stocks To Buy: ఈ 5 స్టాక్స్ ను కొంటే డబ్బే డబ్బు.. ఏకంగా 49% రాబడి!

స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందాలనుకుంటున్నారా అయితే ఐదు స్టాక్స్ కచ్చితంగా కొనండి అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. GHCL, మారికో, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఇండిగో వీటిల్లో పెట్టుబడి పెడితే ఆదాయం పక్కా అని అంటున్నారు. 

New Update
stocks

Pearl Global Stocks

మూడు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో నడుస్తోంది. అయితే మార్కెట్ లో అనిశ్చితి బాగా కొనసాగుతోంది. ఎప్పుడు పడిపతుండి, ఎప్పుడు నిలబడుతుందిఅని చెప్పడం కష్టంగా మారుతోంది. ఈ కారణంగా రోజవారీ ట్రేడింగ్ కంటే దీర్ఘ కాలిక స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం మంచిదని మార్కెట్ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. దానికి సంబంధించి సజెషన్స్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం GHCL, మారికో, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఇండిగో షేర్లు బూమ్ లో ఉన్నాయని..ఒక వేళ మార్కెట్ పడిపోయినా...ఆ షేర్ల ధర పెద్దగా తగ్గదని చెబుతున్నారు. ఈ ఐదు స్టాక్స్ లో పట్టుబడి పెడితే గణనీయమై రాబడిని పొందవచ్చునని సలహా ఇస్తున్నారు. ET Now నివేదిక ప్రకారం పైన చెప్పిన ఐదు స్టాక్స్ 19% నుండి 49% వరకు రాబడిని అందిస్తాయని తెలుస్తోంది. 

Emkay Global GHCL...

దీని టార్గెట్ ధర రూ.900. ఇది 49 శాం వరకూ రాబడిని ఇస్తుందని అంచనాలున్నాయి. GHCL బలమైన వ్యాపార నమూనా కలిగిన సంస్థని..ఇందులో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

మారికో..

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం మోతీలాల్ ఓస్వాల్మారికోకు "కొనుగోలు" సిఫార్సు ఉంది. దీని టార్గెట్ ధర రూ.850. ప్రస్తుతం ఈ స్టాక్ 710 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే 19 శాతం వరకు రాబడి ఉంటుంది. మారికో అనేది హెయిర్ ఆయిల్స్, ఆహార పదార్థాలు వంటి రోజువారీ నిత్యావసరాలను తయారు చేసే ప్రసిద్ధ సంస్థ. దీని వ్యాపారం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ సంస్థ స్టాక్ పడిపోయే ఛాన్సే లేదని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. 

మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్..

ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ. 1750 నుంచి 2వేలకు పెంచారు. ప్రస్తుతం దీని ధర రూ.1604 దగ్గర ట్రేడ్ అవుతోంది.  దీని ప్రకారం ఇది 24 శాతం ఆదాయాన్ని అందిస్తుంది. 

HDFC లైఫ్ ఇన్సూరెన్స్..

మోతీలాల్ ఓస్వాల్  దీనిపై కూడా 'కొనుగోలు' సిఫార్సు ఉచింది. దీని లక్ష్య ధర రూ. 910. ఈ స్టాక్ ప్రస్తుతం రూ. 759 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇది 19% వరకు రాబడిని కూడా అందించగలదు. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బలమైన వ్యాపార నమూనా, మార్కెట్లో పాపులర్ అయిన అతి పెద్ద బీమా సంస్థ

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్...

ఇదే ఇండిగో సంస్థ. దీని టార్గెట్ ధర రూ.6500 నుంచి 7100కి పెరిగింది. ఈ స్టాక్ ప్రస్తుతం రూ.5657 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది 52 శాతం వరకు రాబడని ఇస్తుంది. భారత్ లో ఉన్న అతి పద్ద విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటి. దీని వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 

అయితే ఏ స్టాక్ పైన అయినా పెట్టుబడి ముందే ఎవరికి వారే స్వంతంగా స్టడీ చేసుకోవాలి. ఈ స్టాక్‌లపై బ్రోకరేజ్ సంస్థల సిఫార్సులు వారి స్వంత అభిప్రాయాలను మాత్రమే సూచిస్తాయి. వాటిని వేలిడేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం కస్టమర్లదే. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి పైన చెప్పిన ఐదు స్టాక్స్ మంచి రాబడిని అందివచ్చు. మార్కెట్ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి పక్కా సమాచారం సేరించిన తర్వాతనే పెట్టుబడులు పెట్టడం మంచిది.

Advertisment
తాజా కథనాలు