/rtv/media/media_files/2025/10/08/flipkart-big-bang-diwali-sale-2025-2025-10-08-09-54-14.jpg)
Flipkart Big Bang Diwali Sale 2025
దివాళి పండుగ సమీపిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ Flipkart అదిరిపోయే మరొక కొత్త సేల్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలే big billion days saleతో వినియోగదారులకు అద్భుతమైన డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ అందించింది. ఇప్పుడు కంపెనీ Flipkart Big Bang Diwali Sale 2025తో తిరిగి వచ్చింది. ఈ సేల్‌లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల నుండి గృహోపకరణాల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.
Flipkart Big Bang Diwali Sale 2025 Date
ఈ Big Bang Diwali Sale 2025 అందరు వినియోగదారులకు అక్టోబర్ 11 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు అక్టోబర్ 10న సేల్‌ను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇందులో భాగంగానే Flipkart ఇప్పటికే తన యాప్‌లో బ్యానర్లు, నోటిఫికేషన్‌ల ద్వారా ఈ సేల్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది.
Big Bang Diwali Sale 2025 Offers
Big Bang Diwali Sale 2025లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ సహా మరెన్నో అద్భుతమైన ప్రొడెక్టులపై భారీ తగ్గింపు పొందుతారు. మరీ ముఖ్యంగా ఐఫోన్ వంటి ఫోన్లను తకక్కువ ధరకే సొంతం చేసుకుంటారు.
Iphone 16: Flipkart Big Bang Diwali Sale 2025లో ఐఫోన్ 16పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్లు, అదిరిపోయే డిజైన్ కలిగిన iphone 16 ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తుంది.
Google Pixel 9 series: ఈ సేల్‌లో Google Pixel 9 series స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది కెమెరా, పనితీరుకు అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.
Samsung Galaxy S25 series: ప్రీమియం ఫీచర్లతో పాటు వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగిన Samsung Galaxy S25 series ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్లు మాత్రమే కాకుండా Apple MacBook M2, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, ఇతర బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రీమియం ల్యాప్‌టాప్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్‌లను అందిస్తుంది. అందువల్ల పండుగ సీజన్‌లో తక్కువ ధరలకు ఇష్టమైన గాడ్జెట్‌లను కొనుక్కోవాలనుకున్న వారికి ఇదొక మంచి అవకాశం.
Big Bang Diwali Sale Bank Offers
ఈ సేల్‌లోలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ తన బ్యాంక్ భాగస్వాములతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పలు ప్రొడెక్టులపై భారీ బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు.
SBI కార్డులు: SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ కార్డ్ : యాక్సిస్ బ్యాంక్ కార్డుపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్, రివార్డులు లభిస్తాయి.
ఇతర బ్యాంక్ ఆఫర్లు: HDFC, ICICI, ఇతర బ్యాంక్ కార్డులపై పరిమిత కాల ఆఫర్లు ఉన్నాయి.