Bank Loans: కస్టమర్ల వెంటపడి లోన్లు ఇస్తున్న బ్యాంకులు.. దీని వెనుక పెద్ద ప్లానే ఉంది కదా!

కస్టమర్లు వెంట పడి బ్యాంకులు లోన్ ఇవ్వడం వెనుక పెద్ద స్కామ్ ఉందని నిపుణులు అంటున్నారు. ఫిక్సిడ్ డిపాజిట్ల కింద కట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీకి బ్యాంకులు కస్తమర్లకు ఇస్తుంది. అందుకే అడగకపోయినా లోన్లు ఇస్తాయి.

New Update
Loan

Loan

ఎప్పుడైనా మీరు గమనించారా.. బ్యాంకులు కస్టమర్ల వెంటపడి మరి లోన్లు ఇస్తుంటాయి. వద్దు అన్నా కూడా పదే పదే కాల్ చేసి మరి లోన్స్ ఇస్తున్నారు. దీంతో చాలా మంది లోన్ అవసరం లేకపోయినా కూడా తక్కువ వడ్డీకి ఇస్తున్నారు కదా అని తీసుకుంటారు. నిజానికి బ్యాంకులు చాలా కమర్షియల్ అయిపోయాయి. అందుకే కస్టమర్లు వద్దు అన్నా కూడా బ్యాంకులు  కాల్ చేసి మరి లోన్స్ ఇస్తున్నాయి. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని నిపుణులు అంటున్నారు. అయితే బ్యాంకులు ఇలా లోన్లు ఇవ్వడానికి రీజన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Flipkart Diwali Sale 2025: ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్ రెడీ.. iPhone, Galaxy S25, Google Pixelపై భారీ డిస్కౌంట్‌లు..!

తక్కువ వడ్డీకే ఇస్తున్నామని..

రిజర్వ్‌ బ్యాంక్ డేటా ప్రకారం హోమ్ లోన్ మార్కెట్ జూన్‌లో 9.6% పెరిగి రూ.30.81 లక్షల కోట్లకు చేరింది. పర్సనల్ లోన్లు రూ.14.9 లక్షల కోట్లకు పెరిగాయి. తక్కువ వడ్డీ రేట్లకు ఇస్తున్నామని కస్టమర్లను పెంచుకుంటుంది. ఇదే నిజమని చాలా మంది తీసుకుంటారు. అయితే బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఓ కారణం ఉంది. దేశంలో చాలా మంది బ్యాంకుల్లో మనీని ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉంచుతారు. కానీ బ్యాంకులు మాత్రం 5 నుంచి 6 శాతమే వడ్డీ ఇస్తున్నామని చెబుతుంది. ఆ FD డబ్బును బ్యాంకులు.. రుణాలుగా ఇచ్చేస్తూ.. వడ్డీ భారీగా సంపాదిస్తున్నాయి. అంటే.. కచ్చితంగా లోన్ తిరిగి చెల్లిస్తారు అని అనిపిస్తే.. వడ్డీని 10 నుంచి 12 శాతం విధిస్తున్నాయి. అదే లోన్ చెల్లిస్తారో లేదో అనే డౌట్ ఉంటే.. వడ్డీ 15 నుంచి 24 శాతం దాకా కూడా ఉంటోంది. అంటే చాలా బ్యాంకులు పైకి సేవలు అందిస్తున్నట్లు చెబుతూ.. చేస్తున్నది మాత్రం వడ్డీ వ్యాపారమే. FDలపై నానాటికీ వడ్డీని తగ్గించేస్తూ... రుణాలపై నానాటికీ వడ్డీలను పెంచేస్తూ.. భారీగా లాభాలు పొందుతున్నాయి. అందుకే బ్యాంకులు దివాళా తీసే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. మరో విషయం గమనించాలి. చాలా బ్యాంకులు లోన్ చెల్లించగలిగే వారికి లోన్ ఇవ్వడానికి ఇష్టపడవు. దాని వల్ల వాటికి పెద్దగా లాభం మిగలదు. అదే లోన్ చెల్లించలేని స్థితిలో ఉండి.. నిరంతరం వడ్డీ చెల్లించే స్థితిలో ఉంటే.. అలాంటి వాళ్లకు బాగా లోన్ ఇస్తాయి. ఎందుకంటే.. వారు జీవితాంతం వడ్డీ చెల్లిస్తూనే ఉంటారు. అసలు ఎప్పటికీ తీరదు.

కొన్ని సందర్భాల్లో బ్యాంకులు.. అడిగిన దాని కంటే ఎక్కువ లోన్ ఇస్తామని ఆశ చూపుతాయి. ఎందుకంటే.. అక్కడ కూడా పెద్ద ప్లాన్ ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి రూ.10 లక్షల లోన్ కావాలని అడిగితే.. అతను ఆ లోన్ చెల్లించగలడా లేదా అని చూస్తాయి. చెల్లించగలడు అనుకుంటే.. అప్పుడు అతను.. చెల్లించలేనంత లోన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాయి. ఓ రూ.20లక్షల దాకా లోన్ తీసుకోమని చెబుతాయి. అక్కడే కస్టమర్ ట్రాప్‌లో చిక్కుకుంటాడు. రూ.10లక్షల వరకూ లోన్ చెల్లించగలడు.. మిగతా రూ.10లక్షలు చెల్లించలేక.. వడ్డీ చెల్లిస్తూ ఉంటాడు. ఇక అంతే.. ఆ ట్రాప్ నుంచి బయటకు రావడం కష్టం. ఇలా కస్టమర్లను మోసం చేస్తుంటాయి. అయితే అత్యవసరం అయితే లోన్ తీసుకోవచ్చు. కానీ బ్యాంకులు ఇస్తున్నాయని లోన్ అసలు తీసుకోకూడదు. 

ఇది కూడా చూడండి: Mobile Offers: యాహూ.. సగం ధరకే Samsung AI స్మార్ట్‌ఫోన్ మచ్చా.. రచ్చలేపిన కొత్త ఆఫర్..!

Advertisment
తాజా కథనాలు