Arattai: అరట్టై సంచలనం.. కోటి దాటేసిన డౌన్‌లోడ్‌లు

వాట్సాప్‌కు పోటీగా జోహో సంస్థ అరట్టై అనే స్వదేశీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత శుక్రవారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు 75 లక్షలు ఉండేది. ఇప్పుడు కోటీ దాటింది.

New Update
Arattai

Arattai

ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్‌లో మెసెజ్‌లు చేసుకునేందుకు చాలామంది వాట్సాప్‌నే వాడుతుంటారు. అయితే దీనికి పోటీగా భారత్‌కు చెందిన జోహో సంస్థ అరట్టై అనే స్వదేశీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత శుక్రవారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు 75 లక్షలు ఉండేది. ఇప్పుడు కోటీ దాటింది. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్స్‌ లిస్ట్‌లో అరట్టై 4.8 శాతం రేటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు యాపిల్ స్టోర్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ దాంట్లో ఇది నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.  

Also Read: మోదీ జాగ్రత్త.. ప్రధానిలా అమిత్‌ షా ఉన్నారు.. మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

తమిళంలో అరట్టై అంటే అర్థం పిచ్చాపాటీ సంభాషణ. ఈ యాప్‌ ద్వారా మెసేజ్‌లు చేసుకోవచ్చు. అలాగే వీడియో కాల్స్‌, వాయిస్ సదుపాయం ఉంది. మీటింగ్స్‌లో పాల్గొనడం, స్టోరీస్, ఫొటోలు, డాక్యుమెంట్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. క్లీన్ ఇంటర్ఫేస్‌, గోప్యత వంటి వాటిపై ఫోకస్‌ పెట్టడంతో మంచి యాప్‌గా దీనికి గుర్తింపు వస్తోంది. అంతేకాదు పాకెట్స్ అనేది ఈ యాప్‌లో ప్రత్యేకత. మనకు కావాల్సిన సమాచారాన్ని ఇందులో స్టోర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. 

Also Read: శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు.. రూ.60 కోట్లు చెల్లించాలని ఆదేశాలు

 ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా ఉన్నా కూడా ఈ యాప్‌ పనిచేస్తుంది. కానీ ఎండ్‌టు ఎండ్‌ ఎన్‌క్రిష్షన్ మాత్రం లేదు. ఈ ఫీచర్‌ను చాట్స్‌లో త్వరలోనే తీసుకొస్తామని జోహో ఫౌండర్‌ శ్రీధర్ వెంబు తెలిపారు. 

Also Read: ట్రంప్‌ ముఖచిత్రంతో డాలర్‌ నాణేం.. వచ్చే ఏడాది విడుదల ?

Advertisment
తాజా కథనాలు