/rtv/media/media_files/2025/10/09/samsung-smartphone-offers-2025-10-09-07-46-36.jpg)
samsung smartphone offers
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazon Great Indian Festival Sale మూడవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సేల్ ‘‘దీపావళి’’ వరకు కొనసాగనుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఎలక్ట్రానిక్స్‌తో సహా వివిధ ప్రొడెక్టులపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. వినియోగదారులు నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు.
Mobile Offers
అందువల్ల మీరు మిడ్-రేంజ్ Samsung స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ సేల్‌లో వివిధ రకాల ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో Samsung Galaxy A Series, Samsung Galaxy S Series, Samsung Galaxy M Series స్మార్ట్‌ఫోన్‌లు భారీ ధర తగ్గింపుతో లభిస్తున్నాయి. కంపెనీ దాని Samsung Galaxy S24 FEపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.59,999 ఉండగా.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే Samsung Galaxy M56 5G కూడా దాని అసలు ధర రూ.30,999 కాగా.. ఇప్పుడు రూ.25 వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు.
ఈ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు.
Samsung Galaxy S24 FE 5G AI Phone: అమెజాన్‌లో Samsung Galaxy S24 FE 5G AI స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB Storageపై భారీ తగ్గింపు పొందవచ్చు. దీని అసలు ధర రూ.59,999 ఉండగా.. ఇప్పుడు 50 శాతం తగ్గింపుతో కేవలం రూ.29,999లకే కొనుక్కోవచ్చు.
Samsung Galaxy A55 5G: ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB Storage వేరియంట్ అసలు ధర రూ.42,999 కాగా ఇప్పుడు కేవలం రూ.23,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే దీనిపై 44 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
Samsung Galaxy M56 5G: ఈ మొబైల్‌లోని 8 GB RAM, 128 GB Storage వేరియంట్ అసలు ధర రూ.30,999 కాగా ఇప్పుడు 19 శాతం తగ్గింపుతో రూ.24,999లకే అమెజాన్‌లో లిస్ట్ అయింది.
Samsung Galaxy A17 5G : ఇది లాంచ్ సమయంలో రూ.26,499లకి ప్రారంభమైంది. ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో రూ.22,299లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 8GB RAM, 256GB Storage వేరియంట్‌లో లభిస్తుంది.
Samsung Galaxy A36 5G : ఇందులోని 8GB, 128GB వేరియంట్ అసలు ధర రూ.35,999 కాగా ఇప్పుడు 21 శాతం తగ్గింపుతో రూ.28,499లకు కొనుక్కోవచ్చు.
Samsung Galaxy A26 5G: ఈ మోడల్‌లో 8GB, 256GB వేరియంట్ అసలు ధర రూ.30,999 ఉండగా.. ఇప్పుడు 13 శాతం తగ్గింపుతో రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు.
వీటితో పాటు ఈ సేల్ సమయంలో 55-అంగుళాల స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.