Flipkart Mobile Offers: వాయమ్మో ఇవేం ఆఫర్లరా బాబు.. ఐఫోన్, శాంసంగ్, వివో, మోటో ఫోన్లపై బంపర్‌ డిస్కౌంట్లు..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 రూ.51,999, Galaxy S24 FE రూ.29,999, Motorola Edge 60 Fusion రూ.18,999, Vivo T4 5G రూ.18,799, Realme P4 5G రూ.14,999 కు లభిస్తుంది.

New Update
smartphone offers

smartphone offers

Flipkart Big Bang Diwali Sale Offers: దీపావళి సందర్భంగా అక్టోబర్ 11న ఫ్లిప్‌కార్ట్ తన Big Bang Diwali Saleను ప్రారంభిస్తోంది. ప్లస్, బ్లాక్ సభ్యులు ఈ సేల్ ప్రయోజనాన్ని 24 గంటల ముందుగానే అంటే అక్టోబర్ 10 నుంచే పొందుతున్నారు. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీనితో పాటు SBI డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో iPhone 16, Samsung Galaxy S24 FE, Motorola Edge 60 Fusion, Vivo T4 5G, Realme P4 5G లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వీటిని చాలా చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

iphone 16

Flipkart Big Bang Diwali Sale సమయంలో iphone 16 కేవలం రూ.51,999కే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంటాయి. iphone 16 ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 1179x2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.10-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆపిల్ A18 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 

Samsung Galaxy S24 FE

Samsung Galaxy S24 FE ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.59,999కి బదులుగా రూ.29,999కి లభిస్తుంది. అంటే దాదాపు సగం ధరకే లభిస్తుందన్నమాట. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. Samsung Galaxy S24 FE ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ Exynos 2400e ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Samsung Galaxy S24 FE 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, వెనుక భాగంలో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 60 Fusion

Motorola Edge 60 Fusionను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25,999 కు బదులుగా రూ.18,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. Motorola Edge 60 Fusion ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.70 -అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 5500mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది.

Vivo T4 5G

Vivo T4 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25,999కి బదులుగా రూ.18,799కి లభిస్తుంది. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. Vivo T4 5G.. 6.77-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 7s Gen 3 చిప్‌సెట్ అందించారు. Vivo T4 5Gలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7300 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ Android 15లో పనిచేస్తుంది.

Realme P4 5G

Realme P4 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.20,999 కు బదులుగా రూ.14,999 కు లభిస్తుంది. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. Realme P4 5G.. 6.77-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1080x2392 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 7000 mAh బ్యాటరీ అందించారు. కెమెరా సెటప్ కోసం.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు