/rtv/media/media_files/2025/10/08/flipkart-diwali-sale-on-moto-g96-5g-2025-10-08-12-55-16.jpg)
flipkart diwali sale on Moto G96 5G
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో నడుస్తోంది. ఈ సేల్ నేటితో ముగియనుంది. దీపావళికి ముందు ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో Moto G96 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ ధర తగ్గింపు, ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్‌లతో అందిస్తోంది. ఇప్పుడు Moto G96 5Gపై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
Moto G96 5G Offers
Moto G96 5Gలోని 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం జూలైలో రూ.17,999లకు లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తగ్గింపు (రూ.1,500 వరకు) లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత Moto G96 5G ఫోన్ రూ.14,499కి దొరుకుతుంది. అంటే ఈ ఫోన్ దాని లాంచ్ ధర కంటే రూ.3,500 తక్కువకు లభిస్తుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.13,100 ఆదా చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం ప్రయోజనం పొందాలంటే.. పాత ఫోన్ మోడల్, పనితీరు బట్టి ధర నిర్ణయించబడుతుంది.
Moto G96 5G Specs
Moto G96 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Moto G96 5G స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Android 15 ఆధారంగా Halo UI స్కిన్‌పై నడుస్తుంది. ఈ మొబైల్ 33W వైర్డు టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు 5,500mAh బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. Moto G96 5G స్మార్ట్‌ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఉంది. Moto G96 5G వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, డ్యూయల్-సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 5.2, Wi-Fi, GPS, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి.