🔴Live Breakings: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు.
జగన్ పర్యటనలో రప్పా.. రప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ వివాదాస్పద ప్లకార్డులపై పోలీసులు సీరియన్ అయ్యారు. ఈ ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. బుధవారం జగన్ పర్యటనలో కంటెపుడి దగ్గర అంబటి రోడ్డుపై ఉన్న బారికేడ్స్ తొలగించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. గుడిమెట్లలో వజ్రాల వేట కోసం వెళ్లిన వారికి విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది. దాని బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందంటున్న దాని చూసిన వారు చెబుతున్నారు.
కేంద్రంలో పలుకుబడి ఉందని రెచ్చిపోవద్దని చంద్రబాబుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మీరు చెబితే మోదీ వింటాడు కావొచ్చు.. కానీ తెలంగాణ ప్రయోజనాలను వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లకు అన్నీ అనుమతులు వస్తాయనుకుంటే అది మీ భ్రమ అన్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో పడేసి వెళ్లారు.
బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.