Ap High Court: హైకోర్టు సంచలన తీర్పు.. సీఐడీకి పరకామణి కేసు!

తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.

New Update
BREAKING

BREAKING

తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్, AVSO సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి.. పరికామణి కేసు అత్యవసరంగా CID తో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలని హైకోర్టు తెలిపింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ACB DG కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే లోక్ అదాలత్ లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు