Sajjanar: వాళ్లు ఉగ్రవాదులే.. కర్నూల్ బస్సు ప్రమాదంపై సజ్జనార్ సంచలన ప్రకటన

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
VC Sajjanar Responds on Kurnool Bus Fire Accident

VC Sajjanar Responds on Kurnool Bus Fire Accident

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనయ్యారు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:  తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి

 '' ఒక్కరు చేసిన నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకునేవాళ్లు ఉగ్రవాదులు, మానవ బాంబు కాక ఇంకేమవుతారు. వాళ్లు చేసిన తప్పు వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.

సొసైటీలో మన చుట్టూ తిరిగే ఇటువంటి ఉగ్రవాదులు, మానవ బాంబుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీళ్ల కదలికలపై వెంటనే డయల్ 100కి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్ల మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. మాకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణ నష్టం జరుగుతుందంటూ'' సజ్జనార్ పోస్టు చేశారు. 

Also Read: విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు