/rtv/media/media_files/2025/10/27/big-breaking-2025-10-27-12-39-22.jpg)
Another accident near Kurnool bus accident
BIG BREAKING: కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోరబస్సు ప్రమాదాన్ని మరువక ముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. చిన్నటేకూరు చెట్ల మల్లాపురం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ఓ కంటైనర్ ట్రక్కు వెళ్తోంది. కార్లతో ఉన్న కంటైనర్ కల్లూరు(మం) కొంగనపాడు ఫ్లై ఓవర్‌పై వెళుతున్న క్రమంలో ఓ కారు కంటైనర్‌ను క్రాస్ చేసి ముందుకు వెళ్లింది. స్పీడ్ కంట్రోల్ చెయ్యలేక పోయిన కంటైనర్ డ్రైవర్ వరుసగా మూడు కార్లను ఢీకొట్టాడు.
చిన్నటేకూరు-చెట్ల మల్లాపురం ప్రాంతంలోకి రాగానే ఆ కంటైనర్ ముందు వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొట్టడంతో మూడు కార్లు దెబ్బతిన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. -- ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్ట వశాత్తు ఎవరూ మరణించలేదు.
మూడు కార్లు డ్యామేజ్ కావడంతో అటుగా వెళ్తున్న వారు భయానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. చిన్నటేకూరు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మరో ప్రమాదం జరగడంతో అటుగా వెళ్తున్న వారు ఆ ప్రమాదాన్ని చూసి చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏమి కాలేదనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు.
ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
అలాగే ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (సోమవారం) ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులు బస్సు దిగి వేరే వాహనాలలో వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
Follow Us