Montha Cyclone Effect : ఏపీలో తుఫాన్ టెన్షన్..ముంచుకొస్తున్న మొంథా

మొంథా తుపాన్‌ హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకినాడ తీరంలో కల్లోలంగా మారింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాన్‌ నేపథ్యంలో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

New Update
Monta

Monta

Montha Cyclone Effect:మొంథా తుపాన్‌(montha cyclone in vizag) హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా కాకినాడ(montha cyclone kakinada) తీరంలో కల్లోలం చెలరేగింది. మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.  కాకినాడలో 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లో నవంబర్‌1 నుంచి 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.-- ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు మాత్రం అధికారులు సెలవులు ఇవ్వలేదు.

Also Read :  ఏపీలో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

Also Read :  అందుకే బైక్‌ కనిపించలేదు.. బ్రేక్ వేస్తే ఇంకో యాక్సిడెంట్ జరిగేది.. డ్రైవర్ సంచలన స్టేట్‌మెంట్!

Montha Cyclone Effect

సముద్రంలో ఏర్పడ తీవ్ర వాయుగుండం తుఫాన్‌(cyclone montha)గా బలపడ్డది. ప్రస్తుతానికి చెన్నైకి 600 కి.మీ దూరంలో తుఫాన్ కేద్రీకృతమై ఉంది. విశాఖకు 700 కి.మీ, కాకినాడకు 650 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రం ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారి..రాత్రికి తీరం దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇవాళ కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.-- కాకినాడలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా NDRF, SDRF టీమ్స్‌ కాకినాడకు చేరుకున్నాయి. తుఫాన్ తీరం దాటే టైంలో గంటకు 90 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
 
మరోవైపు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. సోమశిల డ్యాంలో 70TMCలు, కండలేరు జలాశయంలో 60TMCలకు నీరు చేరుకుంది. వెయ్యి హెక్టార్లలో పంటలు నీటి మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో చేపల వేట, చేనేత పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని అధికారులకి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు