/rtv/media/media_files/2025/10/27/erramnaidu-2025-10-27-18-26-00.jpg)
ఎర్రన్నాయుడు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేశారు ఎర్రన్నాయుడు. పాలిటిక్స్ లో హుందాతనానికి కేరాఫ్ గా నిలిచి టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 2012లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అయితే.. ఆయన వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన కుమారుడు రామ్మోహన్ నాయుడు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. మూడు సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే.. ఇటీవల ఆయనకు కుమారుడు జన్మించారు. తండ్రిపై ప్రేమతో కుమారుడికి శివాన్ ఎర్రన్నాయుడు పేరు పెట్టారు రామ్మోహన్ నాయుడు. నిన్న ఢిల్లీలో జరిగిన కుమారుడి నామకరణ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రముఖులు హాజరై రామ్మోహన్ నాయుడు కుమారుడు శివన్ ఎర్రన్నాయుడిని ఆశీర్వదించారు.
‛కుటుంబ వేడుక'
— Kinjarapu Atchannaidu (@katchannaidu) October 27, 2025
నిన్న ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి కుమారుడి బారసాల వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై చిన్నారిని ఆశీర్వదించాను..
బాబుకి “శివాన్ ఎర్రన్నాయుడు” అని నామకరణం చేయడం ఆనందంగా ఉంది..
ఢిల్లీ గడ్డ మీద మారుమోగిన… pic.twitter.com/qKbxCUiwGN
అచ్చెన్నాయుడు ఆనందం..
ఈ వివరాలను రామ్మోహన్ నాయుడు బాబాయ్ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రామ్మోహన్ నాయుడు కుమారుడు “శివాన్ ఎర్రన్నాయుడు” అని నామకరణం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఢిల్లీ గడ్డ మీద మారుమోగిన కింజరాపు వారి ఇంటి పేరుని నిలబెట్టి.. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి మించిన తనయుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.
న్యూఢిల్లీ
— CBN Era (@CBN_Era) September 9, 2025
రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేష్ గారు ఆశీస్సులు pic.twitter.com/jDHbUTKOAr
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సైతం ఢిల్లీలో రామ్మెహన్ నాయుడు ఇంటికి వెళ్లి ఆయన కుమారుడిని ఆశీర్వదించారు. తద్వారా ఎర్రన్నాయుడు కుటుంబంపై తమకు ఉన్న అభిమానాన్ని వారు చాటారు.
Follow Us