AP Crime: ఏపీలో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

ఏపీలోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

New Update
Father rapes his daughter in Prakasham District

Father rapes his daughter in Prakasham District

ఏపీలోని ప్రకాశం జిల్లా(prakasham) లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి(Father Rapes His Daughter) పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కొండపి మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. కొన్ని రోజుల క్రితమ తన రెండు కూతురు (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Also Read: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్‌..లొంగిపోయిన 71 మంది మావోలు

Father Rapes His Daughter

ఈ ఘటన తర్వాత బాలిక కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. దీంతో ఆస్పత్రిలో చూపించగా.. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు. బాలిక తల్లి ఒక్కసారిగా షాకైపోయింది. కూతురును ఇంటికి తీసుకొచ్చింది. అయితే గతంలో తన భర్త కూతురిపై చేతులు వేసి తడుముతున్నట్లు తల్లి గుర్తుచేసుకుంది. భర్తపై అనుమానంతో ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది.

Also Read: ఎంపీకి బిగ్ షాక్.. రూ.10 కోట్లు ఇవ్వకుంటే నీ కొడుకుని చంపేస్తాం..

 చివరికి బాలికను ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లి వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుల చేసింది. ప్రస్తుతం ఆ తండ్రి పరారీలో ఉన్నాడు. అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. కూతురిపై తండ్రి అత్యాచారం చేయడంపై అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు