BIG BREAKING: కాలి బూడిదైన మరో AC స్లీపర్ బస్సు

కర్నూల్‌లో స్లీపర్‌ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి.

New Update
AC sleeper bus catches fire on Agra-Lucknow Expressway, passengers unharmed

AC sleeper bus catches fire on Agra-Lucknow Expressway, passengers unharmed

కర్నూల్‌లో స్లీపర్‌ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సు(AC Sleeper Bus Fire Accident)లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ వెంటనే కిందకి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి ఓ ఏసీ స్లీపర్‌ బస్సు వెళ్తోంది. అయితే రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

Also Read :  PM మోదీ కాన్వాయ్ భద్రతా లోపం.. రోడ్డు మీదే కార్లు వాటర్ వాషింగ్!

AC Sleeper Bus Fire Accident In Uttar Pradesh

Also Read :  దేశంలో 22 ఫేక్‌ యూనివర్సిటీలు.. UGC కీలక ప్రకటన

తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ భయంతో హాహాకారాలు చేశారు. వెంటే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఆ బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. 

ముందుగా బస్సు టైర్‌లో ప్రారంభమైన మంటలు వాహనంలోని మిగిలిన భాగాలు వ్యాపించాయని ఆ బస్సు డ్రైవర్ జగత్ సింగ్ తెలిపాడు. ప్రమాదం తెలుసుకున్న ప్రైవేటు బస్సు సంస్థ ప్రయాణికులను మరో బస్సులో పంపించింది. బస్సులో అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు