Bus Fire Accident: అందుకే బైక్‌ కనిపించలేదు.. బ్రేక్ వేస్తే ఇంకో యాక్సిడెంట్ జరిగేది.. డ్రైవర్ సంచలన స్టేట్‌మెంట్!

కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కీలక విషయాలు వెల్లడించారు.

New Update
driver

కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం(Kurnool Bus Accident) లో 19మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కీలక విషయాలు వెల్లడించారు. వర్షం కారణంగా రోడ్డుపై నల్ల రంగులో ఉన్న బైక్‌ దూరం నుంచి గమనించలేదని ఆయన అన్నారు. తీరా దగ్గరకి వచ్చాక సడెన్‌గా బైక్ కనిపించిందని.. అప్పుడు బ్రేక్ వేస్తూ వెనక వచ్చే వాహనాలు బస్సును ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగే అవకాశముందని తప్పని పరిస్థితుల్లో బైక్‌పై నుంచి పోనిచ్చానని బస్సు డ్రైవర్ లక్ష్మయ్య తెలిపాడు. పోలీసుల దర్యాప్తులో రోడ్డుపై పడి ఉన్న బైకును అంతకుముందే గమనించిన రెండు, మూడు బస్సులు తప్పించుకొని పోయాయని, కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు.

Also Read :  BREAKING: 361 ట్రావెల్ బస్సులపై కేసులు.. 40 బస్సులు సీజ్

బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు

బస్సు ప్రమాద ఘటనపై అదే బస్సులో ప్రయాణించిన రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఇద్దరు నిందితులను జాబితాలో చేర్చారు. అందులో Alగా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, A2గా కావేరి ట్రావెల్స్ యజమాని పేర్లు ఉన్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని పేర్కొంటూ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ఇదే బస్సు అగ్ని ప్రమాదంలో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మరణించిన బైకర్ శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రి స్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు(Kurnool Bus Accident Driver Arrested). విచారణలో భాగంగా ఎర్రిస్వామి తాను, శివశంకర్ కలిసి మద్యం చేవించినట్లుగా తెలిపాడు. శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ను అతివేగంతో నడిపి డివైడర్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి వెల్లడించాడు.

Also Read :  వాళ్లు ఉగ్రవాదులే.. కర్నూల్ బస్సు ప్రమాదంపై సజ్జనార్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు