AP RTA: 361 ట్రావెల్ బస్సులపై కేసులు.. 40 బస్సులు సీజ్

కర్నూలు ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో  రెండు రోజులుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.

New Update
RTA officials

కర్నూలు ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ మనీశ్‌ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో  రెండు రోజులుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూల్స్ పాటించకుండా తిరుగుతున్న 361 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను సీజ్ చేశారు(rta seized private travels). అనుమతి లేకుండా బస్సులో సీటింగ్ మార్పులు చేసిన 63 ట్రావెల్స్ బస్సులు గుర్తించారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయని ట్రావెల్స్‌పై భారీగా జరిమానాలు విధించారు.

Also Read :  అందుకే బైక్‌ కనిపించలేదు.. బ్రేక్ వేస్తే ఇంకో యాక్సిడెంట్ జరిగేది.. డ్రైవర్ సంచలన స్టేట్‌మెంట్!

RTA Officials Case Against Private Travel

Also Read :  వాళ్లు ఉగ్రవాదులే.. కర్నూల్ బస్సు ప్రమాదంపై సజ్జనార్ సంచలన ప్రకటన

ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకుండా తిరుగుతున్న 11, అగ్నిమాపక పరికరాలు లేని 83 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. బస్సుల్లో తగిన ఫైర్ అలారం, రక్షణ వ్యవస్థ లేని 14 బస్సులను గుర్తించారు. అనుమతి లేకుండా గూడ్స్, పార్సిళ్లను తీసుకెళ్లే 11 బస్సులకు జరిమానా విధించారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66, పల్నాడు 36, ప్రకాశం జిల్లాలో 34 బస్సులపై కేసులు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో 25, చిత్తూరు 8, కర్నూలు 14, ఎన్టీఆర్ 42, అన్నమయ్య జిల్లాలో 21 ట్రావెల్స్ బస్సులపై కేసులు(rta on private travels) నమోదు చేశారు. బస్సుల్లో తనిఖీలు చేస్తూనే ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర ద్వారాల నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలనే విషయమై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు