/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతుంటే ఏపీలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు విపరీతంగా పడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో సూరీడు మండుతున్నాడు. మొత్తంగా విభిన్నమైన వాతావరణ పరిస్థితిని ఏపీ వాసులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు కీలక సూచనలు సూచించింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
Also Read: RCB VS PBKS: సొంత గ్రౌండ్ లో రెండోసారి ఓటమి..5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచిన పంజాబ్
భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మరోవైపు శనివారం రోజున ఏపీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేదీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.''శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Also Read: Urvashi Rautela: నటి ఊర్వశీపై చర్యలు తీసుకోవాలి.. తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న అర్చకులు
APSDMA Predicts Rain In Sevaral Districts
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మరికొన్ని జిల్లాలలో శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.7°C ఉష్ణోగ్రత, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. మరోవైపు తీవ్రవడగాలులు వీచే ప్రాంతాల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read:Kalyan Ram: 'నాన్నా... గర్వంగా ఉంది' కొడుకు మాటలకు కల్యాణ్‌రామ్ ఎమోషనల్
Also Read: ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?
telugu-news | srikakulam | vizayanagaram | ap-weather | latest-telugu-news | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | latest telugu news updates | AP Weather Alert | ap today weather update | ap telugu news | today-news-in-telugu | breaking news in telugu