/rtv/media/media_files/2025/04/19/w4n85awoJOSTuxsVjvqe.jpg)
RCB VS PBKS
ఆర్సీబీని బ్యాడ్ లక్ వీడటం లేదు. దానికి తోడు బెంగళూరు ప్లేయర్ల చెత్త ఆటతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్నారు. ఈరోజు తమ సొంత గ్రౌండ్ లోనే ఓడిపోయింది ఆర్సీబీ. బంళూు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 12.1 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. సొంతగడ్డపై బెంగళూరు జట్టు చతికిలపడం ఇది రెండోసారి. ఆ జట్టులో నేహల్ వధేరా (33*) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు.
Also Read : పంజాబ్ పై ఓటమి.. ఐపీఎల్లో ఆర్సీబీ చెత్త రికార్డ్
Also Read : టపటపా వికెట్లు..ముక్కిమూలిగి 96 పరుగులు
చెత్త బ్యాటింగ్...
ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ తో సహా అందరూ చేతులెత్తేశారు. వికెట్లను టపటపా పోగొట్టుకున్నారు. టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తోంది. దీన్ని పంజాబ్ బౌలర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. 14 ఓవర్లలోనే మొత్తం అన్ని వికెట్లు తీయలిగారంటే...పిచ్ బౌలింగ్ కు ఎంత అనుకూలిస్తుందో ఊహించవచ్చు. దానికి తోడు ఆర్సీబీ బ్యాటర్లు అసలు ఏ మాత్రం ఎఫర్ట్ పెట్టలేదు. దాంతో కనీసం వంద పరుగులు కూడ దాట లేకపోయారు. మొత్తం టీమ్ లో టిమ్ డేవిడ్ ఒక్కడ 30 పరుగులతో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. అతని తర్వాత కెప్టెన్ రుతురాజ్ 23 పరుగులు చేశాడు. 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ పంజాబ్ కు 96 పరుగులు లక్ష్యాన్నిచ్చింది.
Also Read : టాస్ గెలిచిన పంజాబ్.. 14 ఓవర్లకు మ్యాచ్
Also Read : క్రికెటర్ KL రాహుల్ కూతురి పేరు ఏంటో తెలుసా?.. భలే ఉందే
IPL 2025 | today-latest-news-in-telugu | RCB vs PBKS | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu