ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?

గగన్ యాత్రి వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారని కేంద్రం తెలిపింది. దీంతో ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు శుక్లా నిలవనున్నారు.

New Update
Group Captain Shubhanshu Shukla

భారతీయ అంతరిక్ష రంగం మరో మైలురాయి చేరుకోనుంది. గగన్ యాత్రి వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా నియమితులైనారు. ఆయన మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారని కేంద్రం తెలిపింది. దీంతో ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు వెళ్తున్న మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు శుక్లా నిలవనున్నారు. ఇస్రో ఇప్పటివరుకూ అంతరిక్ష రంగంలో ఎన్నో ప్రయోగాలను విజయవంతం చేసింది.

Also read: 28 హాస్పిటల్స్ సీజ్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

మరో రికార్డ్ స‌ృష్టించడానికి ఇస్రో భారతీయ వ్యోమగామిని చారిత్రాత్మక అంతరిక్ష యాత్రకు సిద్ధంగా చేసింది. గగన్‌యాన్ మిషన్, ISS మిషన్, ఇంకా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలతో భారతదేశ అంతరిక్ష కలలు మరింత ఎత్తుకు ఎదుగుతున్నాయని కేంద్ర అంతరిక్ష, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

మిషన్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?

గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా గత 8 నెలలుగా NASA, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ Axiom స్పేస్‌లో ISSకు వెళ్తడానికి శిక్షణ పొందుతున్నారు. భారతదేశం 60 మిలియన్ డాలర్లు(512 కోట్ల 32 లక్షల 35వేలు) చెల్లించిన ప్రైవేట్ వాణిజ్య మిషన్‌లో ISSకి పంపనున్నారు. ఈ మిషన్ SpaceX ఫాల్కన్ 9 రాకెట్‌పై ప్రారంభించబడుతుంది. గ్రూప్ కెప్టెన్ శుక్లా మరో ముగ్గురి హ్యోమగాములతో కలిసి SpaceX క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ప్రయాణించనున్నారు. ఇది USAలోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి బయలుదేరుతుంది.

Also read: AP liquor scam: విచారణలో విజయసాయి రెడ్డి సంచలన విషయాలు

కొన్ని రోజులు క్రితం ISSలో చిక్కుకున్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్ లు కూడా ఇక్కడే ల్యాండ్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మిషన్ కోసం 40ఏళ్ల శుభాన్షు శుక్లాను ఎంపిక చేసింది. ఎందుకంటే అతని కెరీర్ చాలా కాలం ఉందని. ఆక్సియం-4 (యాక్స్-4) మిషన్ కమాండర్‌గా నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ వ్యవహరిస్తారు. మిగిలిన ఇద్దరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ,  మిషన్ స్పెషలిస్ట్ అయిన హంగేరీకి చెందిన టిబోర్ కాపు. గ్రూప్ కెప్టెన్ శుక్లా ఈ మిషన్ పైలట్‌గా ఉంటారు. 

(isro | indian astronauts | international-space-station | Group Captain Shubhanshu Shukla | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు