AP Rain Alert : దూసుకొస్తున్న మరో అల్పపీడనం || High Alert To AP || AP Rains || Weather Report || RTV
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. ఇది పది రోజుల్లో దిశ మార్చుకుని, ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదలుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ చెప్పింది.మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.